స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల ను అధికారులు సమన్వయంతో చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

 

వరంగల్ అర్బన్ (ప్రజా అమరావతి);


స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల ను అధికారులు సమన్వయంతో చేపట్టాలి::  జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.  


స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల ను అధికారులు సమన్వయంతో చేపట్టాలనీ  జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు రావలసి ఉన్నాయని, అంతకంటే ముందుగా ఏర్పాట్లపై అందరు అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. వేడుకలకు వచ్చే అతిథికి పొలిసు గౌరవ వందనంతో పాటు వేడుకలలో పొలిసు బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. వేదికకు ఇరువైపులా మాస్కులు, సనిటైజర్లు, అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ అధికారులకు కోరారు.   మైదానంలో వాటరింగ్ చేయాలని, వేదికను అందంగా అలంకరించాలని ఉద్యాన శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. స్టాల్ల్స్ , శకటాల ఏర్పాటుకు డి.ఆర్.డి.ఓ., వ్యవసాయ, ఉద్యాన,  జిల్లా శిశు సంక్షేమాధికారి, వైద్య, ఆరోగ్య, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ అధికారలు సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఉత్తమ సేవాలు అందించిన ఉద్యోగుల వివారాలు ఒక్కకొక్క శాఖకు ఇద్దరు  మించకుండా 11 వ తేది లోపు కలేక్టరేట్ కార్యాలయంనకు  పంపాలని జిల్లా అధికారులను సూచించారు.  

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంద్యారాణి, అదనపు డి.సి.పి. భీం రావు, ఏ.సి.పి. వేముల శ్రీనివాస్,  డి.ఆర్.డి.ఓ., శ్రీనివాస్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి, వాసుచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. లలిత దేవి, పిడి డ్వామా భద్రు, డి.డబ్లు.ఓ. సభిత, డి.ఈ.ఓ., నారాయణ రెడ్డి, ఉప సంచాలకులు, షెడ్యుల కులముల సక్షేమం నిర్మల, జిల్లా మైనారిటీ సక్షేమ అధికారి శ్రీను, జిల్లా పౌర సరఫర ఆధికారిణి వసంతలక్ష్మి, డి.ఎం. సివిల్ సప్లై కృష్ణవేణి, ఎ.డి. అగ్రికల్చర్ దామోదర్ రెడ్డి, సి.పిఒ సత్యనారాయణ రెడ్డి, ఎల్దిఎమ్ మురళిమోహన్, ఇతర అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Comments