విద్యార్థుల బంగారు భవిష్యత్తే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం

 *విద్యార్థుల బంగారు భవిష్యత్తే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం* 



 *రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చెన బోలు గోపాలకృష్ణ .* 


 అనంతపురం ,ఆగస్టు 4 (ప్రజా అమరావతి); 

 రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి చిన్నబోయిన గోపాలకృష్ణ తెలిపారు. 

బుధవారం ఉదయం అనంతపురం అరవింద నగర్ లోని వెనకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని అనంతపురం శాసనసభ్యులు వెంకట్రామిరెడ్డి తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లను ఉన్న ప్రారంభించిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి హాస్టల్ ను సందర్శించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా హాస్టళ్ల పనితీరు... ప్రత్యేకించి బాలికల వసతి గృహాల్లో త్రాగునీటి సౌకర్యం  తదితర మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేట్ యజమాన్యాల బకాయిల చెల్లింపుల అంశాలపై ప్రభుత్వం దృష్టిని సాధించినట్లు పేర్కొన్నారు. 

హాస్టళ్లలో వంట పని చేస్తున్న సిబ్బందికి రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయిలో వంటచేసే విధానం పై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తద్వారా హాస్టళ్లలో ఉంటున్న ఇంటర్ , డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. సంక్షేమ హాస్టళ్లలో గతంలో కంటే మెరుగైన వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నదని , నూతన మెనూ పట్ల సైతం విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు.

బలహీనవర్గాలను మెరుగైన విద్య మాత్రమే బలవంతులుగా చేస్తుందన్న విశ్వాసాన్ని అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కలిగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు తెలిపారు.  రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు మంత్రి గోపాలకృష్ణ తెలిపారు. 

విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.  హాస్టల్ లో పనిచేస్తున్న సిబ్బంది తో మాట్లాడుతూ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని భోజన వంటకాల్లో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మంచి భోజనాన్ని తయారు చేయాలని సూచించారు. విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు అందించేందుకు ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే విధంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణల అమలుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అలాగే జగన్నన వసతి దీవెన , విద్య దీవెన లాంటి పథకాలను ప్రతి విద్యార్థికి అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పేద మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో  ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి విద్యార్థుల హాస్టళ్లకు రూ .10 కోట్లను మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాస్టల్ లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు అన్ని వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురంలో వెయ్యి మంది దాకా విద్యార్థులు ఉండే విధంగా నూతన వసతిగృహాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వసీం సలీం , 2వ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్,  డివిజన్ కార్పొరేటర్ నరసింహులు,  బీసీ సంక్షేమ శాఖ అధికారులు యుగంధర్, నాగ ముని ,లలిత ,పద్మావతి నాయకులు రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.


Comments