వ్యవహారిక తెలుగు భాషను భావితరాలకు వారసత్వంగా అందించిన దార్శనిక కవి గిడుగు రామ్మూర్తి పంతులు

 విశాఖపట్నం ..ఆగస్టు 29 (ప్రజా అమరావతి);


       వ్యవహారిక తెలుగు భాషను భావితరాలకు వారసత్వంగా అందించిన దార్శనిక కవి గిడుగు రామ్మూర్తి పంతులు
గారి జయంతిని రాష్ట్రస్థాయిలో జిల్లాలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రా యూనివర్సిటీ  వై.వి.యస్ మూర్తి ఆడిటోరియం లో జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి 158 వ జయంతి " తెలుగు భాష దినోత్సవం " కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గిడుగు రామ్మూర్తి పంతులు  గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 

            ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు చెందిిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి  వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగు భాష అతి పురాతనమైన, ప్రాచీనమైన భాష అనీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే పుట్టిన భాషనీ ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే భాష తెలుగు అని అన్నారు. అటువంటి తెలుగు వారిగా పుట్టడం మనందరి అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రపంచమంతా తెలుగు భాష గొప్పదనం, ఔన్నత్యాన్నీ ,విశిష్టతను రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిదన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచం లో అభివృద్ధి చెందుతున్న తరుణంలో మన మాతృ భాష తో పాటు ఇతర భాషలను కూడా నేర్చు కోవాల్సిన అవసరం ఉందన్నారు.మన ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాఠశాలలలో  ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం తో పాటు తెలుగు సబ్జెక్ట్ కూడా తప్పనిసరి చేశారన్నారు.పోటీ ప్రపంచంలో మనం  రాణించాలంటే తెలుగు భాష తో పాటు ఇతర భాష ల్లో కూడా  ప్రావీణ్యం పొందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నారన్నారు.

      ఆనాడే మన తెలుగు భాష ఔన్నత్యాన్ని నన్నయ,తిక్కన లాంటి మహా కవులూ, పండితు లు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఉత్తరాంధ్ర జిల్లాల భాష,యాస ను, వ్యవహార భాష లో ఉన్న అందాలను తెలియ జేసిన మహానుభావుడు అని, గ్రాంధీీక భాషలో ఉన్న తెలుగును వాడుక భాషలో కి మార్చారన్నారు. అదే విధంగా సవర భాషకు గుర్తింపు నిచ్చిన మహోన్నత వ్యక్తి జయంతిని మనమందరం కలిసి తెలుగు భాషా దినోత్సవం గా జరుపు కోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

             కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న అధికార భాషా సంఘం అధ్యక్షులు  డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల వారు సులభంగా మాట్లాడే విధంగా తెలుగు భాషను అందించిన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి ఉత్సవాలను మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం తెలుగు వారి గొప్పతనం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు భాష కు అత్యధిక ప్రాధాన్యతను కల్పించారన్నారు.

           తెలుగుభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మరియు చందు సుబ్బారావు కలిసి రచించిన "తెలుగు సాహిత్యం -సమాజం- చరిత్ర"  పుస్తకాన్ని ఆవిష్కరించారు.

           ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బి సత్యవతి , జిల్లా జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి , రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, నెడ్క్యాప్  చైర్మన్ కే కే రాజు , E&WIDC ఛైర్మన్ మళ్ళ విజయప్రసాద్, DCMS ఛైర్పర్సన్ పల్లా చిన తల్లి, ఏ యు ప్రొఫెసర్ చందు సుబ్బారావు,, ప్రొ. షేక్ మస్తాన్, గిడుగు రామ్మూర్తి పంతులు గారి మునిమనవడు గిడుగు నాగేశ్వరరావు పంతులు గార్లకు సాంస్కృతిక వ్యవహారాల శాఖ తరపున ఘనసన్మానం  చేశారు.