కె.ఎల్.డీమ్డ్ విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ లా విద్యార్థులు రూపొందించిన సైబర్ అలెర్ట్ మొబైల్ యాప్ ను

 గుంటూరు (ప్రజా అమరావతి);     కె.ఎల్.డీమ్డ్ విశ్వవిద్యాలయం కాలేజ్ ఆఫ్ లా విద్యార్థులు రూపొందించిన సైబర్ అలెర్ట్ మొబైల్ యాప్ ను


రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సూచరిత సోమవారం ఆమె కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,అనూహ్యంగా పెరిగిపోతున్న సైబర్‌ నేరాలకు కళ్లెం వేసేందుకు పోలీసు శాఖ మూడంచెల వ్యూహం అమలు చేస్తోందని అన్నారు.సైబర్‌ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.సైబర్ అలర్ట్ యాప్ ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలను, సైబర్ పోలీస్ స్టేషన్ యొక్క వివరాలు, సైబర్ లా యొక్క ముఖ్యమైన అంశాలు, సైబర్ కంప్లైంట్ లో ఇచ్చే విధానం,సైబర్ నేరాలకు సంబంధించిన సూచనలు, సలహాలు ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా అశేష ప్రజల అందుబాటులో  ఉంటుందని తెలిపారు.యాప్ రూపొందించిన విద్యార్థులను యాప్ వివరాలు అడిగి తెలుసుకుని,విద్యార్థులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో లా విభాగం విభగదీపతి డాక్టర్ పవన్ కుమార్,ప్రిన్సిపాల్ డాక్టర్ రంగయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments