శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):  జమ్మి దొడ్డి లోని ఆలయం మీటింగ్ హాల్ నందు విజయవాడ పశ్చిమ  ఏసిపి శ్రీ హనుమంతరావు గారు, సీఐ శ్రీ వెంకటేశ్వర్లు , ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు  మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి శ్రీ భ్రమరాంబ గారి ఆధ్వర్యంలో ఆలయ ఇంజనీరింగ్, అన్ని విభాగముల AEO లు, పర్యవేక్షకులు, శానిటేషన్ మరియు సెక్యూరిటీ విభాగంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, కరోనా వ్యాప్తి నివారణ దృష్ట్యా తీసుకొనవలసిన చర్యల గురించి చర్చించడం జరిగింది. 

ఈ సందర్భంగా ఏసీపీ  మాట్లాడుతూ భక్తులు ప్రాంగణము లోకి ప్రవేశించినప్పుడు ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజ్ చేయుట, క్యూలైన్లు యందు భక్తులు సామాజిక దూరం పాటించువిధముగా చూడటం, మాస్కులు విధిగా ధరించు విధముగా చర్యలు తీసుకొనుట,  భక్తులు దేవస్థానం ప్రాంగణంలో గుంపులు గుంపులుగా కూర్చొనకుండా పటిష్టమైన చర్యలు తీసుకొనవాల్సినదిగా ఆలయ సెక్యురిటి సిబ్బంది మరియు హోమ్ గార్డ్స్ వారికి తెలిపారు. ఆలయ ప్రాంగణములలోని పలు ప్రదేశముల యందు శానిటైజర్లు ఏర్పాటు చేయవలసినదిగానూ, ఎప్పటికప్పుడు క్యూ-లైన్ లు మరియు ఆలయ ప్రాంగణములు శానిటైజ్ చేయవలసిందిగా శానిటేషన్ సిబ్బందికి సూచించారు.


అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మరియు చైర్మన్ గారు మాట్లాడుతూ సిబ్బంది మరియు భక్తులు అందరి సమిష్టి కృషితో కొవిడ్ నివారణకు కృషి చేయాలని తెలిపారు.

Comments