విజయవాడ (ప్రజా అమరావతి):
వచ్చే మార్చి నాటికి ఆహార శుద్ధి యూనిట్లకు శంకుస్థాపన
ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేయాలి
రైతుకు రెట్టింపు ఆదాయం కల్పించేలా ప్రణాళికలు చేయండి - మంత్రి కన్నబాబు
వచ్చే మార్చి నాటికి రాష్టంలో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్కో ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్ నిర్మాణాలను ప్రారంభించాలని మంత్రి కన్నబాబు అధికారులను ఆదేశించారు .
రాజ్ భవన్ పూర్వ కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశ్రమల శాఖ (ఆహార శుద్ది) కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా మంత్రి కన్నబాబును బుధవారం
మర్యాద పూర్వకంగా కలిశారు .
రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న కృషిని మంత్రి చెబుతూ ఆహార శుద్ధి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫుడ్ ప్రాసెస్సింగ్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆహార శుద్ది యూనిట్ల నిర్మాణానికి మార్చినాటికి పనులు ప్రారంభించి అక్కడ నుంచి ఏడాది లోపు నిర్మాణాలను పూర్తి చేయాలని మంత్రి చెప్పారు.
స్థల సేకరణ లో ఎటువంటి ఇబ్బందులున్న సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమన్వయము చేసుకొని నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు.
అయా జిల్లాలలో పండే పంటల అధారంగా ఏ జిల్లాలో ఎటువంటి పరిశ్రమ రావాలన్న దానిపై కార్యచరణ చేయాలని మంత్రి సూచించారు. పెద్ద ఎత్తున ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన , నిరుద్యోగులకు ఉపాధికలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు . పీఎంఎఫ్ఎంఈ పథకం సమర్ధవంతంగా అమలు చేస్తూ సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఆహార శుద్ధి సొసైటీ సీఈఓ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment