విజయనగరం (ప్రజా అమరావతి);;
పూసపాటిరేగ మండలం చౌడువాడలో గత అర్ధరాత్రి ప్రియుడి చేతిలో పెట్రోల్ దాడికి గురై జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ రాములమ్మను, ఆమె సోదరిని పరామర్శించిన మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ.
ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని, మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించి పూర్తిస్థాయిలో కోలుకొనే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని, ఆమె చికిత్సకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని మహిళ రాములమ్మకు ధైర్యం చెప్పిన మంత్రులు.
రాములమ్మ తల్లి, సోదరితో మాట్లాడి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ, మంత్రుల వెంట జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, ఎస్.పి. శ్రీమతి దీపిక, శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య, బడుకొండ అప్పలనాయుడు, ఎం.ఎల్.సి. సురేష్‌బాబు.
యువతిని పరామర్శించిన అనంతరం ఆసుపత్రి ఆవరణలో మీడియాతో మంత్రిన మంత్రులు పుష్పశ్రీవాణి, బొత్స సత్యనారాయణ.
పూసపాటిరేగ మండలం చౌడువాడ దుర్ఘటన చాలా దురదృష్టకరం, పెళ్లిచేసుకోవలసిన వ్యక్తే తనకు కాబోయే భార్యపై అనుమానంతో దాడిచేయడం అమానుషం, దీనిని ఖండిస్తున్నాను ; ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం తెచ్చిన దిశ యాప్ ఈరోజు బాధితురాలి ప్రాణాన్ని కాపాడింది ; ఉప ముఖ్యమంత్రి
దిశ యాప్‌లో సాస్ బటన్ బాధితురాలి సోదరి ప్రెస్ చేయడంతో వెంటనే 25 నిముషాల్లో పోలీసులు గ్రామానికి చేరుకొని బాధితురాలిని, దాడిలో గాయపడ్డ మరో ఇద్దరిని ఆసుపత్రిలో తక్షణమే చేర్పించి ప్రాణాలు కాపాడగలిగారు; డిప్యూటీ సి.ఎం. పుష్పశ్రీవాణి
రాష్ట్రంలోని ఆడబిడ్డలంతా ఇప్పటికైనా దిశ యాప్‌ను ప్రతిఒక్కరూ డౌన్ లోడ్ చేసుకొని ఆపద సమయంలో ఎస్.ఓ.ఎస్. బటన్ నొక్కితే పోలీసుల రక్షణ లభిస్తుంది; ఉప ముఖ్యమంత్రి
విజయనగరంలో ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ ;
చౌడువాడ ఘటనలో బాధితులకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు, అయినా మెరుగైన వైద్యం అందించేందుకు వారు ముగ్గురినీ విశాఖలోని స్టీల్ ప్లాంటు బర్న్స్ ఆసుపత్రికి తరలిస్తాం.ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడు రాంబాబు, అతనిని ఈ ఘటనకు ప్రోత్సహించిన వారిని గుర్తించి శిక్ష పడేలా చర్యలు చేపడతారు.
దాడికి గురైన యువతి రాములమ్మతో నిందితుడు రాంబాబు కు 8 నెలల క్రితం నుంచి పరిచయం వుంది, ఇద్దరూ ప్రేమించుకుంటుండగా పెద్దల సమక్షంలో పెళ్లి చేయడానికి కూడా ఒప్పందం కుదిరింది.అక్టోబరులో పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిర్ణయం చేశారు.రాత్రి ఒంటిగంట సమయంలో రాములమ్మ ఇంటికి రాంబాబు వెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టాలని ప్రయత్నించాడు
బాధితురాలి కుటుంబానికి తదుపరి ఏవిధమైన సహాయం అందించాలో ప్రభుత్వం నిర్ణయించి వెల్లడిస్తుంది; మంత్రి బొత్స సత్యనారాయణ
addComments
Post a Comment