స్పందన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి


*స్పందన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి


*


*వచ్చిన సమస్యను వచ్చినట్టుగా వెంటనే పరిష్కరించాలి* *స్పందన కార్యక్రమానికి హెచ్ ఓ డి లు తప్పకుండా హాజరు కావాలి....* 


 *అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు...* 


కర్నూలు, ఆగస్టు 23 :(ప్రజా అమరావతి(- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న స్పందన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని వచ్చిన సమస్యను వచ్చినట్టుగా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ”స్పందన“ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతుభరోసా) రామ సుందర్ రెడ్డి,జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) నారపురెడ్డి మౌర్య, , శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ తమీమ్ ఆన్సారియా, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డి ఆర్ వో పుల్లయ్య,  జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

స్పందన అర్జీలను స్వీకరించిన అనంతరం కలెక్టర్ అర్జీల పరిష్కారానికి సంబంధించిన పురోగతిపై  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గడువు దాటిన సమస్యలను వందశాతం  నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు ప ప్రజలకు సేవ చేయడం లో బిజీగా ఉండాలన్నారు.   అర్జీ దారులతో మర్యాద తో మాట్లాడాలన్నారు. రూల్ ప్రకారం సమస్యను  పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు వర్తించనప్పుడు, మన పరిధిలో సమస్య పరిష్కారం కానప్పుడు,  అదే విషయాన్ని  అర్జీదారునికి మృదువుగా తెలియజేయాలన్నారు .


ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి ఆయా శాఖల హెచ్ ఓ డి లు తప్పకుండా హాజరు కావాలన్నారు. మండలాల్లో తహసీల్దార్లు కూడా కచ్చితంగా హాజరు కావాలన్నారు..మండలాల వారీగా ప్రతి సోమవారం స్పందన  కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ మండలంలో ఎక్కువ అర్జీలు వచ్చాయి... అందులో ఏ అంశానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్న వివరాలను శనివారం సాయంత్రం లోపు తనకు రిపోర్టు పంపాలన్నారు.  ఎక్కువ సమస్యలు ఉన్న మండలాలలోని అధికారులు స్పందన అర్జీలపై సక్రమంగా  స్పందించనందునే   ఇక్కడి దాకా వస్తున్నారని అర్థం చేసుకోవచ్చన్నారు..అధికారులు స్పందన అర్జీలను మండల స్థాయిలోనే పరిష్కరిస్తే ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండదని అధికారులు గుర్తించాలన్నారు. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో  పెండింగ్ అర్జీలు ఎక్కువగా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఏ సచివాలయాల్లో ఎక్కువ సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్న వివరాలు కూడా తనకు తెలియజేయాలన్నారు.అదేవిధంగా 

పత్రికల్లో వచ్చే  నెగటివ్ వార్తలకు అధికారులు వెంటనే స్పందించి   క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. అక్కడ ఏదైనా పొరపాటు ఉంటే,.  వాటిని  సరిదిద్దాలన్నారు.


 *గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలు చేపట్టాలి:-* 


రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆశయం మేరకు సచివాలయాల్లో మెరుగైన సేవలు అందుతున్నాయా లేదా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లాలో ఇప్పటివరకూ దాదాపు 754 గ్రామ వార్డు సచివాలయాలను విజిట్ చేయలేదన్నారు.   జిల్లా అధికారులందరూ జిల్లాలోని అన్ని సచివాలయాలు తనిఖీ చేసే విధంగా జడ్పీ సీఈవో, డిపిఓ మండలాలను కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు..  జిల్లా కేంద్రానికి దూరంగా ఉండే సచివాలయాల ను కూడా తనిఖీ చేయాలన్నారు.. ఇకపై తాను కూడా దూరంగా వుండే సచివాలయాలను విజిట్ చేస్తానన్నారు.  ప్రతి గ్రామ వార్డ్ సెక్రటేరియట్లో డెమోగ్రాఫిక్ వివరాలు ఉండేవిధంగా తీసుకోవాలని కలెక్టర్ డీపివోను  ఆదేశించారు. 


*కలెక్టరేట్ సుందరీకరణ పనులు వచ్చేవారం నుంచి మొదలు పెట్టాలి*


  కలెక్టరేట్ ను  అన్ని వసతులతో శబ్దం వచ్చే విధంగా వచ్చే వారం నుంచి పనులు ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని ప్రతి బ్లాకుకు జిల్లాలో ప్రసిద్ధి గాంచిన నదులు లేదా ఇతర అంశాలకు సంబంధించిన పేర్లను ఎంపిక చేసి   పెట్టాలన్నారు. ప్రతి బ్లాక్ లోని హెచ్ ఓ డి లు తమ కార్యాలయాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. , అలాగే  టాయిలెట్లు పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటికి సంబంధించి వాటర్ డిమాండ్ ను బట్టి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు..

వాహనాల పార్కింగ్ అస్తవ్యస్తంగా  ఉందని, క్రమపద్ధతిలో పార్కింగ్ చేసే విధంగా చూడాలన్నారు .ఈ అంశాలు అన్నింటిపై చర్చించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, వచ్చే వారం నుంచి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఖాళీగా ఉన్న ప్రదేశాలలో మొక్కల పెంపకం చేపట్టాలని హార్టికల్చర్, డ్వామా,  అటవీ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.