రెండో సారి టీటీడీ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన జాబితాలో వై.వీ సుబ్బారెడ్డిది నాలుగో స్థానం


*టీటీడీ ఛైర్మన్ గా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన వై.వీ సుబ్బారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


*రెండో సారి టీటీడీ ఛైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన జాబితాలో వై.వీ సుబ్బారెడ్డిది నాలుగో స్థానం


*


*వై.వీ అంకితభావానికి అది నిదర్శనం: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


తిరుపతి, ఆగస్ట్, 13 (ప్రజా అమరావతి); పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ వై.వీ సుబ్బారెడ్డితో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం తిరుపతిలోని టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కార్యాలయంలో  వై.వీ సుబ్బారెడ్డితో ఆయన సమావేశమయ్యారు. రెండోసారి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ  పూలగుచ్ఛం అందజేసి మంత్రి గౌతమ్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. రెండు సార్లు టీటీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన జాబితాలో వై.వీ సుబ్బారెడ్డి నాలుగో స్థానంలో ఉండడం  ఆయన అంకితభావానికి నిదర్శనమని మంత్రి గౌతమ్ రెడ్డి కొనియాడారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో పాటు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కూడా హాజరై టీటీడీ ఛైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపారు.


-----------

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image