ఫొటోగ్రఫీలో పెదవడ్లపూడి వాసికి అంతర్జాతీయ పురస్కారం.

 ఫొటోగ్రఫీలో పెదవడ్లపూడి వాసికి అంతర్జాతీయ పురస్కారం.



మంగళగిరి (ప్రజా అమరావతి);


ప్రపంచ ఫొటోగ్రఫీ  దినోత్సవం సందర్బంగా ఇండియా ఇంటర్నేషనల్        ఫొటో గ్రాఫిక్ కౌన్సిల్   ప్రకటించిన అంతర్జాతీయ పురస్కారాలలో గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలకసంస్థ పరిధి పెదవడ్లపూడికి చెందిన వీ3 స్టూడియో అధినేత గోలి వెంకట శివకుమార్ కు అత్యున్నత పురస్కారం వరించింది. 


ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా అనుబంధ సంస్థ ఐఐపీసీ (ఇండియన్ ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్) ప్రతి ఏడాది ప్రపంచ దేశాల్లో వివిధ అంశాలపై గత నాలుగు దశాబ్ధాలుగా అందజేస్తోంది. ఈ నేపధ్యంలో ఈనెల ఒకటవ తేదీ ఆదివారం వెబ్ సైట్ ద్వారా గ్రహీత పేర్లను సంస్థ ఛైర్మన్ డాక్టర్ ఓపీ శర్మ ప్రకటించారు. కలర్ నేచర్ ఫొటో జర్నలిజం ట్రావెల్ అంశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఫొటోగ్రాఫర్లు పంపిన డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం న్యాయ నిర్ణేతలు ప్రతిభావంతులను ఎంపిక చేశారు.


గోలి వెంకట శివకుమార్ కలర్ విభాగంలో పిక్టోరియల్ అంశం మీద అసోసియేట్ షిప్ అనే హానర్ కు ఎంపికైనట్లు ప్రకటించారు. అరకు గాంధారి,  ఒడిస్సా గిరిజన ట్రైబల్ వాళ్ల జీవన విధానం మీద తీసిన  డాక్యుమెంటరీ వెంకట శివకుమార్ చిత్రీకరించారు.  ఈ అవార్డు కోసం 20 ఛాయా చిత్రాలతో కూడిన ఫొటో డాక్యుమెంటరీ ఈ ఏడాది మార్చిలో పంపారు. న్యాయ నిర్ణేతలు శివకుమార్ తీసిన ఛాయా చిత్రాలకు ముగ్ధులై ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇప్పటికే వెంకట శివకుమార్ అమెరికా, ఇండియా, సింగపూర్ నుంచి 5 హానర్లు అందుకున్నారు.


ప్రపంచ దేశాలనుంచి పలువురు ఫొటో గ్రాఫర్లు దీనిలో పాల్గొన్నారు. ఈ అవార్డులకు మొత్తం అయిదుగురు ఎంపిక కాగా అందులో గోలి వెంకట శివకుమార్ ఒకరు కావడం విశేషం. ఈ మేరకు ఈనెల 19వ తేదీ వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఢిల్లీ లోని త్రివేణి కళా సంగమంలో జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో ఎంపికైన అవార్డును వెంట శివకుమార్ అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ జనరల్ సెక్రటరీ టి. శ్రీనివాసరెడ్డి తో పాటు పలువురు ప్రముఖ ఫొటో గ్రాఫర్లు గోలి వెంకట శివ కుమార్ కు  అభినందనలు తెలిపారు.

Comments