*ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమ మండలి అధ్యక్షురాలు పి.భాగ్యమ్మ బాధ్యతల స్వీకరణ
* మంగళగిరి (ప్రజా అమరావతి); ఆంధ్రప్రదేశ్ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి అధ్యక్షురాలు పి. భాగ్యమ్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధి యర్రబాలెం లో గల రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి అధ్యక్షురాలు భాగ్యమ్మ మాట్లాడుతూ... రాష్ట్రంలోని గ్రామాల్లో చిన్న మరియు కుటీర పరిశ్రమలను స్థాపించేందుకు ఔత్సాహికులైన నిరుద్యోగ యువతకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తామని చెప్పారు. యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించి వారి ఆర్థిక స్వావలంభనకు కృషి చేస్తామన్నారు. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలికి విశేష ప్రాధాన్యతనిస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన సీఎం జగన్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మండలి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, డి రఘురాముడు, ఆర్.పురుషోత్తంరెడ్డి, బి.రామ్మోహన్ రెడ్డి, ఆర్.రవిచంద్రారెడ్డి, బి.చంద్రశేఖర్ రెడ్డి, డి.లింగన్న,ఎం.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment