రక్షాబంధన్ అనేది హిందూ మత పండుగలలో అత్యంత ప్రాచుర్యం పొందినదని

 పశ్చిమ గోదావరి జిల్లా.. ఏలూరు..(ప్రజా అమరావతి);


రక్షాబంధన్ అనేది హిందూ మత పండుగలలో అత్యంత ప్రాచుర్యం పొందినదని


ఈ వేడుకను ఒక సోదరుడు, సోదరి మధ్య బంధం కొరకు జరుపుకుంటారని పురాతన పండగలలో ఒకటిగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..

శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారని సాంప్రదాయకంగా సోదరీమణులు సోదరుని యొక్క మణికట్టు మీద ఒక రాఖీ కడితే చెడు నుండి రక్షణ కలుగుతుందని నమ్మకం అని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..

తద్వారా సోదరులు వారి సోదరీమణుల జీవితకాలంలో అన్ని రకాల చెడుల నుండి రక్షణ కల్పిస్తామని, జాగ్రత్తగా చూసుకుంటాను అని ప్రతిజ్ఞ చేయడం రాఖీ బంధన్ అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ళ అనుబంధమని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

ఏలూరు 16వ డివిజన్ లో పలువురు మహిళలు మంత్రి ఆళ్ల నాని గారి దగ్గరికి వచ్చి రాఖీ పండుగ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని గారికి రాఖీ కట్టి, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు..

రక్షాబంధన్ సోదరీమణులు మధ్య బంధానికి గుర్తుగా ఉంటుందని, రెండు వైపుల నుండి రక్షణను రక్షాబంధన్ సూచిస్తుందని ఇది కూడా సామాజిక బంధానికి గుర్తు లాంటిదని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

చారిత్రాత్మకంగా రాఖీ పండుగకు ఒక ప్రస్తావన ఉందని, రాఖీ పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా ప్రజలు భావిస్తారు అని రాఖీ బంధన్ ఒక సంప్రదాయంగా ఉన్నదని, వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలను అనుసరిస్తారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

రక్షాబంధన్ పండుగ సోదరులు మరియు సోదరీమణులుమధ్య ప్రేమ బంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించబడిందని మంత్రి ఆళ్ల నాని చెప్పారు..

రాఖీ అనే యజ్ఞోపవీతం సోదరి అభిమానంతో ఒక సోదరుని యొక్క మణికట్టు మీద కడుతుందాని, ఆమె ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తుందాని, ఆమె సోదరుని ఆధ్యాత్మిక దృష్టి ద్వారా మార్గనిర్దేశాన్ని చేస్తుందాని మంత్రి ఆళ్ల నాని చెప్పారు...

ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ చైర్ పర్సన్ శ్రీమతి మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, డిప్యూటీ మేయర్ లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయ్యి సుధీర్ బాబు 15వ కార్పొరేటర్ తంగెళ్ల రాము,16వ డివిజన్ కార్పొరేటర్ కోయ సత్యబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ కురెళ్ళ రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు...