శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): . శ్రీ అమ్మవారి నవరాత్రి రోజులలో అలంకరించు శ్రీఅమ్మవారి అవతారముల ప్రారంభోత్సవం నకు గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విచ్చేయగా గౌరవ దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ మతి జి.వాణీ మోహన్, IAS గారు, ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు మరియు పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ అమ్మవారి ఆలయము నుండి శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయమునకు వెళ్లు మెట్ల మార్గములో భక్తులు దర్శించు విధముగా గోడలపై ఏర్పాటు చేసిన శ్రీ అమ్మవారి దసరా నవ రాత్రి రోజులలో అలంకరించు శ్రీ అమ్మవారి అవతారములను(శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి, శ్రీ గాయత్రి దేవి, శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ సరస్వతీ దేవి, శ్రీ గజలక్ష్మీ దేవి, శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి, శ్రీ దుర్గా దేవి, శ్రీ మహిషాసురమర్ధినీ దేవి మరియు శ్రీ రాజరాజేశ్వరి దేవి) గౌరవ మంత్రివర్యులు ప్రారంభించారు. అనంతరం వీరు శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు.
addComments
Post a Comment