సీతమ్మకు బంగారు హారం బహూకరణ.
తిరుపతి (ప్రజా అమరావతి) :
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలోని శ్రీ సీతమ్మవారికి కర్నూల్‌కు చెందిన శ్రీ సి.పుల్లారెడ్డి బుధవారం ఉదయం రూ.1.85 లక్షల విలువ గల 38.042 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు.
ఆలయ ఏఈవో శ్రీ మురళీధర్‌కు దాత హారాన్ని అందజేశారు. అనంతరం హారానికి పూజలు నిర్వహించి, అమ్మవారికి అలంకరించారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ వెంకటేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ గిరి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment