ప్రతి ఒక్క ఆదివాసీ వద్దకూ ప్రభుత్వం'- జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్

 ప్రతి ఒక్క ఆదివాసీ వద్దకూ ప్రభుత్వం'- జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్* 


అనంతపురం, ఆగస్టు 09 (ప్రజా అమరావతి);


జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ సోమవారం స్థానిక పెన్నార్ లో భవన్ లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. 


కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఆదివాసీ వద్దకు చేరుకోవడమే ఈ ఏడాది అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం యొక్క నినాదమన్నారు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మైదాన, కొండ మరియు అటవీ ప్రాంతాలు అని తేడా లేకుండా గిరిజనులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తోందన్నారు. 


గిరిజన విద్యార్థుల కోసం జిల్లాలో 22 సంక్షేమ హాస్టళ్లు, 3500 మందికి ఫీజు రీయింబర్స్ మెంట్, తల్లులకు అమ్మఒడి, నాడు-నేడు ద్వారా గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 

గత ఏడాది జిల్లాలో రూ.160 కోట్లు ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఖర్చు చేశామన్నారు. 


జిల్లాలో వైస్సార్ రైతు భరోసా ద్వారా 359 మంది గిరిజన రైతులకు రూ.48.46  లక్షలు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. గిరిజన రైతులకు పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ సేవలు అందించామన్నారు. మైనింగ్ మరియు అటవీ అధికారుల నుంచి రక్షణగా ప్రభుత్వం గిరిజనులకు అటవీ హక్కులు కల్పించిందన్నారు. గిరిజన కుటుంబాలకు గృహావసరాలకు ఉచిత విద్యుత్తు అందిస్తూ జీవో నెంబర్ 94 జారీ చేయడం ద్వారా జిల్లాలోని గిరిజనులు 200 యూనిట్లలోపు విద్యుత్తును ఉచితంగా పొందుతున్నారన్నారు. 

2020-21 సంవత్సరమునకు గాను 480.00 లక్షల నిధులను 26539 పేద గిరిజన కుటుంబాలకు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. 


వైయస్సార్ చేయూత పథకం ద్వారా గిరిజన లబ్ధిదారులకు ఏటా రూ.18,750 రూపాయలు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ పథకం ద్వారా మొదటి విడత 7702 మంది లబ్ధిదారులు, రెండో విడత 8485 మంది లబ్ధిదారులు గిరిజన కుటుంబాలకు సుమారు రూ.30 కోట్లు అందజేశామన్నారు.


కార్యక్రమం అనంతరం గిరిజన రైతులకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా  బోరు మరియు విద్యుత్ మోటార్లు లబ్ధిదారులకు  లక్ష రూపాయల సబ్సిడీతో, 20 వేల రూపాయలు లబ్ధిదారుడు  ఆమోదంతో  కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా  గిరిజన లబ్ధిదారులకువ్యవసాయ మోటార్లు పంపిణీ చేశారు. 


అంతకుముందు కార్యక్రమానికి సంబంధించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్, జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, గిరిజన సంక్షేమ శాఖ ఏడీ అన్నా దొర, వివిధ గిరిజన సంఘాల కుల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 


Comments