మంత్రి కొడాలి నానిని సత్కరించిన ఆలయ అర్చకులు మంటసాల- మంత్రి కొడాలి నానిని సత్కరించిన ఆలయ అర్చకులు మంటసాల 
గుడివాడ, ఆగస్టు 21 (ప్రజా అమరావతి): రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ను గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అర్చకునిగా పనిచేస్తున్న ఘంటసాల సుబ్రహ్మణ్యశర్మ ఘనంగా సన్మానించారు. శనివారం గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కొడాలి నాని ముందుగా శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించారు. అనంతరం కాలినడకన సచివాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్తుండగా మంత్రి కొడాలి నానిని అర్చకులు సుబ్రహ్మణ్యశర్మ తన ఇంటికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానిని పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, గుడివాడ ఎండీవో ఏ వెంకటరమణ, పంచాయతీరాజ్ డీఈ హరనాథ్ బాబు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ అట్లూరి వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ పోటూరి వెంకటేశ్వరమ్మ, మాజీ సర్పంచ్లు ఏలేటి అగస్టీన్, వెలిసేటి సరళ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోళ్ళ రామకృష్ణ, పర్నాస సర్పంచ్ గొర్ల రాజేష్, పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ, గ్రామ ప్రముఖుడు చెర్వు ప్రదీప్ శ్రీరామసాయి, వైసీపీ నేతలు పోటూరి శ్రీమన్నారాయణ, అద్దేపల్లి పురుషోత్తం, కరారి రాంబాబు, బచ్చు మణికంఠ, కోట రాకేష్, కోట మహేష్, తాళ్ళూరి ప్రశాంత్, అద్దేపల్లి హరిహరప్రసాద్, జీ హర్ష తదితరులు పాల్గొన్నారు.

Comments