పర్యావరణం తోనే మానవ మనుగడ సాధ్యమౌవుతుంది.

 

  కారుమంచి (ప్రజా అమరావతి);


పర్యావరణం తోనే మానవ మనుగడ సాధ్యమౌవుతుంది.



  ---శాసనమండలి ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం.


 పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమౌతుందని శాసనమండలి ప్రొటెం స్పీకర్ విఠపు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు కారుమంచి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని    మొక్కలు నాటి విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ నాటిన ప్రతి మొక్కను బ్రతికించడం మన అందరి లక్ష్యం గా ఉండాలన్నారు.మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి నేతృత్వంలో కారుమంచి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలలో ఐదు వేల మొక్కలు నాటి వాటన్నిటినీ బ్రతికించడం గొప్ప విషయమని తెలిపారు.నేడు నాట బోతున్న రెండువేల మొక్కలను కూడా బ్రతికిస్తారనే నమ్మకం ఉందన్నారు.గత 30 సంవత్సరాలుగా వలంరెడ్డి లక్ష్మణ రెడ్డితో కలిసి అక్షరాస్యతా ఉద్యమం,మద్య వ్యతిరేక ఉద్యమం,శాస్త్రీయ భావజాల వ్యాప్తిలో కలసి జన విజ్ఞాన వేదిక లో పని చేసామని నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు.టొబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు ప్రసంగిస్తూ  పొగాకు పరిశ్రమ వలన దాదాపు  ప్రతి ఏటా 10 లక్షల టన్నుల కలపను వాడుతున్నామని  అందువలన టొబాకో బోర్డు వృక్షాలను పెంచి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం తమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. లక్ష్మణరెడ్డి నేతృత్వంలో కారుమంచి గ్రామం ఆదర్శ గ్రామంగా రూపొందుతుందని మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.ప్రకాశం జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డి ప్రసంగిస్తూ కారుమంచి గ్రామ అభివృద్ధి లో ప్రకాశం జిల్లా పరిషత్ పూర్తి తోడ్పాటు అందిస్తుందని హామీ ఇచ్చారు. రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి ప్రసంగిస్తూ గ్రామాలలో వర్గ,వైవిద్యాలకు   తావులేకుండా అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.మా ఊరు అభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ కారుమంచి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి అందరి సహాయ సహకారాలు తీసుకుంటామన్నారు.కులం,వర్గం రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా కృషి చేస్తామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం 32% ఉండగా మన రాష్ట్రంలో 22 శాతం మాత్రమే ఉందని 33 శాతానికి తీసుకుని వెళ్లడం ద్వారా పర్యావరణాన్ని రక్షించగలుగాతామని తెలిపారు.

డ్వామా అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి ప్రసంగిస్తూ ప్రకాశం జిల్లాలో మొక్కలను పెంచే బాధ్యతను గ్రామ సర్పంచ్ లకు కేటాయించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టంగుటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి  అజిత, కారుమంచి గ్రామ సర్పంచ్ మన్నం శ్రీనివాస్,గ్రామ పెద్దలు బత్తుల కృష్ణ,చిట్టేల రామిరెడ్డి,మాళ్లే నారపరెడ్డి,మేడికొండ దుర్గాప్రసాద్,

ఎక్కసిరి శ్రీను,కంజుల సుబ్బారెడ్డి, కందుల రాజారావు,దొనెంపూడి జయరావు,కొండలరావు,ఆత్మకూరి నాగేశ్వరరావు,గుమ్మడి శ్రీకాంత్,

జయవరం గ్రామ సర్పంచ్ మల్లవరపు పేరమ్మ, వల్లూరు గ్రామ పెద్ద హనుమారెడ్డి,నిడమానూరు గ్రామ పెద్ద వల్లంరెడ్డి రమణారెడ్డి,

డ్వామా ఏపిఓ నాగేశ్వరరావు,ఫీల్డ్ అసిస్టెంట్ వీరభ్రమం,గ్రామ పంచాయతీ సెక్రటరీ అంకయ్య 

 తదితరులు పాల్గొన్నారు.


        

  

Comments