నిర్భంధ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి జె ఎన్ టి యు ఉపకులపతి

 నిర్భంధ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి

జె ఎన్ టి యు  ఉపకులపతి



ప్రతి ఒక్కరు మొక్కలు నాటుదాం:  సంయుక్త  కలెక్టర్


జిల్లాను 100% పచ్చదనంతో నింపుతాం:  డి ఎఫ్ ఓ. 




, అనంతపురం,ఆగస్టు 5 (ప్రజా అమరావతి): నిర్భంధ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని  JNTU  ఉప కులపతి, రంగ జనార్ధన్  పిలుపునిచ్చారు.  జిల్లాసామాజిక   వనాల అభివృద్ధి   ఆధ్వర్యంలో  జగనన్న పచ్చ తోరణం - వనమహోత్సవ కార్యక్రమం గురు వారం  JNTU  కళాశాలలో  ఆడిటోరియంలోజరిగింది.  ఈ కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ  పకీరప్ప,  జిల్లా సంయుక్త కలెక్టర్, సంక్షేమ మరియు అభివృద్ధి  సిరి, ఫారెస్ట్ కన్సర్వేటర్, పిఎస్ శ్రీనివాస శాస్త్రి, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీ సందీప్ కృపాకర్ ,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు  ఈ సందర్భంగా  ముఖ్య అతిధి  ఉపకులపతి మాట్లాడుతూ

చెట్లు లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని, కాలుష్యం పెరుగుతోందని అన్నారు. సమాజమే మొక్కలు పెంచాలనీ పిలుపునిచ్చారు. 

చెట్లు నరుకుతున్నామని, అటవీ శాఖతోపాటు ప్రజలు సంరక్షణకు ముందుకు రావాలని కోరారు. మొక్కలు నాటేందుకు, బ్రతికించేందుకు బాధ్యులను చేయాలని ఆయన అన్నారు. సహజంగా లభించే ఆక్సిజన్ మొక్కల నుండి వస్తుందని గ్రహించాలని ఆయన సూచించారు. 

జిల్లా సంయుక్త కలెక్టర్  సిరి  మాట్లాడుతూ మొక్కలు నాటడం ఒక ఉద్యమ రూపంలో రావాలని కోరారు. యువజన, విద్యార్థులు, మహిళా సంఘాలు తదితర సంఘాలను భాగస్వాములను చేయాలని ఆమె  కోరారు. రాష్ట్రంలో  ఈరోజు  75 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించుటకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది  ఆమెతెలిపారు. మొక్కలు ఎన్ని నాటినా తక్కువేనని  తెలిపారు.నిరంతర ప్రక్రియగా మొక్కలు నాటేందుకు దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో 11 శాతం మాత్రమే అటవీ ప్రాంతం ఉందని పేర్కొన్నారు. జిల్లా, మండల, పంచాయతీలలో పాటు మనకు ఉన్న విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండాలని  ఆమె చెప్పారు. జిల్లాలో వన మహోత్సవం -  జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో 57 లక్షలు మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని  తెలిపారు. 

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా సంరక్షణ చేపట్టాలన్నారు. వాయు కాలుష్య నివారణకు మొక్కలు ఎంతో ఉపయోగం అన్నారు.

జిల్లా అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ  అనంతపురం జిల్లాలోని 1226  హెక్టార్ల ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. 38 లక్షలు  మొక్కలు కేవలం ప్రజలకు పంపిణీ చేయటానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.  జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారు రెండు వేల కిలోమీటర్ల అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నారు. అలాగే 130

హెక్టార్ల లలో బ్లాక్ ప్లాంటేషన్ చేపడుతున్నామని పేర్కొన్నారు. వనమహోత్సవం సందర్భంగా పోస్టర్లను విడుదల చేశారు.

కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటాలని 

  సభికుల చే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులు కలిసి అతిథులు విశ్వవిద్యాలయ ఆవరణలో యందు మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో  ప్రొఫెసర్ సుజాత, విష్ణు ప్రియ, అటవీశాఖ అధికారులు  సూర్య చంద్ర రాజు, ఉదయ దీప్, శ్రీనివాసులు, samil   తదితరులు పాల్గొన్నారు.


Comments