స్వామి వారిని అభిషేకించడం పూర్వజన్మసుకృతం

 స్వామి వారిని అభిషేకించడం పూర్వజన్మసుకృతం


 డాక్టర్ బూసి రెడ్డి నరేందర్ రెడ్డి

  విజయవాడ (ప్రజా అమరావతి);


శ్రీకృష్ణుని ఐదు కోట్ల హరి నామ జప యజ్ఞం లో పాలుపంచుకోవడం, శ్రీ స్వామి వారిని అభిషేకించడం తన పూర్వజన్మ సుకృతం అని ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బూసి రెడ్డి నరేందర్ రెడ్డి  పేర్కొన్నారు. శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకొని రెండు రోజుల వేడుకల్లో భాగంగా ఆదివారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజైన ఆదివారం నాడు శ్రీ స్వామివారి ఐదు కోట్ల హరి నామ జప యజ్ఞం నిర్వహించారు. హరే క్రిష్ణ మూవ్మెంట్ విజయవాడ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డాక్టర్ బూసి రెడ్డి నరేందర్ రెడ్డి, డాక్టర్ దీప్తి రెడ్డి దంపతులు అభిషేక కళాశాలను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు కరోనా ను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలని, రాష్ట్ర ప్రజలకు తన చల్లని దీవెనలు అందజేయాలని వేడుకున్నట్లు తెలిపారు. అంతకుముందు  శ్రీ స్వామివారికి పంచామృతం, పంచగవ్వ సుగంధద్రవ్యాలు,ఫల పుష్పాదులతో అభిషేకాన్నికన్నుల పండువగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో ఆహుతులను అలరించారు.

Comments