అందరికీ అరోగ్యం ప్రభుత్వ లక్ష్యం
రూ.80.00 లక్షలతో అర్బన్ హెల్త్ సెంటర్ కు శంఖుస్ధాపన
దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ (ప్రజా అమరావతి) : ప్రయివేట్ ఆస్పత్రుల దోపిడిని ఆరికట్టడానికి, అందరికీ అరోగ్యం వైసీపీ ప్రభుత్వ లక్ష్యం అని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గురువారం 45వ డివిజను రోటరీనగర్ (కబేళా హౌసింగు) వద్ద రూ.80.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం చేయనున్న అర్బన్ హెల్త్ సెంటరుకు మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి తదితరులతో కలిసి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు గారు శంఖుస్ధాపన చేశారు. కరోణా కష్టకాలంలో కూడా ప్రజలకు సంక్షేమం, అభివృద్ది ఫలాలు అందించి ఘనత జగనన్నది అన్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేందకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు, కోత్త ఆరోగ్య కేంద్రాలకు శుంకుస్థాపన చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి,కోటిరెడ్డి వైసీపీ శ్రేణులు ఉన్నారు..
addComments
Post a Comment