- దేశం కోసం సర్వస్వాన్ని ధారపోసిన త్యాగమూర్తి ఆంధ్రకేసరి టంగుటూరి
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, ఆగస్టు 23 (ప్రజా అమరావతి): దేశం, దేశ ప్రజల కోసం తన సర్వస్వాన్ని ధారబోసిన త్యాగమూర్తి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. సోమవారం ట్విట్టర్ ద్వారా భారత రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150 వ జయంతి సందర్భంగా వారికి ఘననివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రజల ఆవేశానికి, అకుంటిత ధైర్య సాహసాలకు, అసమాన త్యాగ నిరతికి టంగుటూరి నిదర్శనంగా నిలిచారన్నారు. కృషి చేయడం పరమాత్ముని పూజగా జీవితాంతం భావించారన్నారు. 1929 లో మద్రాసు వచ్చిన సైమన్ కమిషనను వ్యతిరేకిస్తూ సైమన్ గో బ్యాక్ అంటూ టంగుటూరి గర్జించారన్నారు. బ్రిటీష్ సైనికుల తుపాకులకు ఎదురెళ్ళి చొక్కా గుండీలు విప్పి కాల్చుకోండిరా అనడంతో తుపాకులు తలలు వంచాయన్నారు. ఆంధ్రజాతికి తిరుగులేని నాయకునిగా టంగుటూరి వెలుగొందారని మంత్రి కొడాలి నాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
addComments
Post a Comment