శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి): 

      ఒలింపిక్స్(బ్యాడ్మింటన్) కాంస్య పతక విజేత, భారత క్రీడాకారిణి శ్రీ పి.వి.సింధు గారు శ్రీ అమ్మవారి దర్శనార్థం కుటుంబసభ్యులతో కలిసి ఆలయమునకు విచ్చేయగా, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 

శ్రీ పి.వి.సింధు గారికి మరియు కుటుంబసభ్యులకు శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ పి.వి.సింధు గారికి పట్టు వస్త్రాలు, శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం ను అందజేశారు.

Comments