నవరత్నాల పథకాల అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన గౌ. జిల్లా ఇంచార్జి మంత్రి

 

నవరత్నాల పథకాల అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన  గౌ. జిల్లా ఇంచార్జి మంత్రి 


రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముందు చూపుతో కోవిడ్  థర్డ్ వేవ్ ను  సమర్థవంతంగా ఎదుర్కునేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం :  గౌ. జిల్లా ఇంచార్జి మంత్రి  

పింఛన్ల మంజూరులో అర్హులైన లబ్ధిదారులను మరోసారి పరిశీలించి అర్హత మేరకు పింఛన్ల మంజూరు : గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి 

సంక్షేమ పథకాల అమలులో అర్హులైన లబ్ధిదారులు పథకాల  లబ్ధి పొందని యడల అర్హులను గుర్తించి పథకాల లబ్ధిని అందజేయండి : గౌ.రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు 

తిరుపతి, ఆగష్టు 31 (ప్రజా అమరావతి): రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముందు చూపుతో కోవిడ్ థర్డ్ వేవ్  ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు చర్యలు చేపడుతున్నామని  , చిత్తూరు  జిల్లా గౌ. ఇంచార్జి మంత్రి  మరియు ఐటీ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణా శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ నందు జిల్లా సమీక్షా సమావేశం జిల్లా ఇంచార్జి మంత్రి అద్యక్షతన జరుగగా గౌ.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖా మాత్యులు కె.నారాయణ స్వామి, గౌ.రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి లతో కలసి జిల్లా ప్రగతిపై  సమీక్ష నిర్వహించారు. 

ఈ సమీక్షా సమావేశానికి  గౌ.చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు ఎన్.రెడెప్ప, డా.ఎన్.గురుమూర్తి, గౌ. తిరుపతి , పీలేరు , చిత్తూరు, తంబళ్లపల్లి, సత్యవేడు , శ్రీకాళహస్తి , పూతలపట్టు, పలమనేరు, మదనపల్లి, శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, అరణి శ్రీనివాసులు, పెద్ది రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఆదిమూలం, బియ్యపు మధుసూధన్  రెడ్డి, ఎం.ఎస్.బాబు, వెంకటే గౌడ్, నవాజ్ బాషా, గౌ. ఎం.ఎల్.సీ. లు యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, రాజసింహులు , జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, జిల్లా జాయింట్ కలెక్టర్ లు ( రెవెన్యూ , అభివృద్ధి,  హౌసింగ్ , సంక్షేమం) రాజా బాబు, వీ.వీర బ్రహ్మం , వెంకటేశ్వర, రాజశేఖర్ , తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీషా,  మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, తిరుపతి, చిత్తూరు, ఆర్ డీ ఓ లు కనకనరసా రెడ్డి, రేణుక ,  మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

ఈ సమీక్షా సమావేశంలో భాగంగా తొలుత  నవరత్నాల  పథకాలైన  పెదలందరికీ ఇళ్ళు, 90 రోజుల్లో ఇంటి పట్టాలు, ఎ పి ఎస్ పి డి సీ  ఎల్ , ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ  పథకం, సచివాలయాలు వైద్యం, విద్య, ప్రాథమిక రంగాలు, గ్రామీణ నీటి సరఫరా, ఇరిగేషన్ శాఖల వారీగా మంత్రులు సమీక్ష నిర్వహించారు. 

ఈ సంధర్భంగా గౌ. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమ కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులందరికీ చేర వేసేలా పూర్తి సమన్వయం తో పనిచేయాలని అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చాలన్నారు.  పింఛన్ల మంజూరులో ఇంకనూ అర్హత కలిగిఉన్న  లబ్ధిదారులను మరోసారి పరిశీలించి అర్హత మేరకు పింఛన్ల మంజూరు చేయాలని,  పేదలు సాగుచేసుకునే అటవీ భూములకు సంబందించి అటవీ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేసి అటవీ భూముల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు  కేటాయించుట   కొరకు  గుర్తించిన   భూమి నివాసయోగ్యంగా ఉండాలని తెలిపారు.  దేశంలో ఎక్కడా లేని  విదంగా  నాడు – నేడు కార్యక్రమం క్రింద పాఠశాలలను ఆధునీకరణ చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతున్నదన్నారు.

సభాద్యక్షులు గౌ.ఇంచార్జి మంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా సంక్షేమ పథకాల అమలులో  ముందంజలో ఉందని  ఈ సంధర్భంగా  జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. రాష్ట్ర ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నీ చర్యలు చేపడుతున్నారని తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు  ఆసుపత్రులలో మౌలిక వసతులు, మందులు, తదితర ఏర్పాట్లు అన్నీ ముందస్తుగానే చేసి ముఖ్యమంత్రి ముందు చూపుతో ఎదుర్కోగలుగుతున్నామని తెలిపారు. కోవిడ్ కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను 100 శాతం అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిదేనని అన్నారు.  నియోజకవర్గాల వారీగా సంక్షేమ పథకాల అమలు లోగల సమస్యల పై  స్థానిక శాసనసభ్యులు, మరియు సంబందిత అధికారులతో చర్చించి చర్యలు చేపడతామని తెలిపారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే చిత్తూరు జిల్లా అన్ని సంక్షేమ పథకాల అమలులో ముందంజలో కలదని తెలిపారు. సమీక్షలో భాగంగా ఎం.ఎల్.ఏ లు,  ఎం.ఎల్.సీ లు వారి నియోజకవర్గాల వారీగా తెలిపిన సమస్యలను పరిష్కరిస్తామని,  జిల్లా స్థాయిలో పరిష్కారం కానీ వాటిని  ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకొని వెళ్ళి పరిష్కరిస్తామన్నారు.  

గౌ.రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖా మాత్యులు  మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో అర్హులైన లబ్ధిదారులు పథకాల  లబ్ధి పొందని యడల అర్హులను గుర్తించి పథకాల లబ్ధిని అందజేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్  మోహన్ రెడ్డి అన్నీ వర్గాలకు కుల , మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించేందుకు పూర్తి పారదర్శకతతో అమలు చేసేలా సచివాలయ వ్యవస్థను తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులు తెలిపి లాభసాటి వ్యవసాయం చేసే దిశగా  అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖాలను మార్చారని ఈ పాఠశాలల్లో కల్పించిన వసతుల పరిరక్షణకు  అవసరమైన  సెక్యూరిటి ఏర్పాట్ల నిమిత్తం ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ కు  సూచించారు.  

తిరుపతి ఎం.పి. మాట్లాడుతూ తిరుపతి, తిరుచానూరు లో గల వ్యవసాయ మార్కెట్ యార్డు కు మన జిల్లా వ్యాప్తంగా పండే అన్ని రకాల మామిడి పండ్లు రావడం జరుగుతుందని  వాటిని ఇతర దేశాలకు పంపేందుకు అధునాతన పద్దతులను వినియోగించి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలని సభ దృష్టికి తీసుకొనిరాగా , అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. 

పీలేరు శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో పెదలందరికీ ఇళ్ళు కార్యక్రమ అమలుపై నియోజకవర్గ స్థాయిలో , మండల స్థాయిలో సమీక్షలు నిర్వహించడం ద్వారా పురోగతి ఉంటుందని , నాడు – నేడు కార్యక్రమం అధ్బుత కార్యక్రమంగా అభివర్ణించారు. వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లను జగనన్న ప్రభుత్వంలో బాగా సిద్దం చేస్తున్నారని ఈ క్లినిక్ లను త్వరితగతిన పూర్తి చేసి ఇందులో అవసరమైన మందులను నిల్వ ఉంచాలని తెలిపారు. 

చిత్తూరు శాసనసభ్యులు మాట్లాడుతూ జగనన్న కాలనీలలో విద్యుదీకరణ పనులను త్వరగా చేపట్టాలని , మామిడి  రైతులు ఫాక్టరీ లకు తరలించిన మామిడి పంట బకాయిలు చెల్లించాలని తెలిపారు. 

తంబళ్లపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ మంజూరుకు సంబందించి సదరన్ క్యాంపు నిర్వహణ, అర్హులైన లబ్ధిదారుల పింఛన్ మంజూరుపై దృష్టి సారించాలని , వెనుకబడిన నియోజకవర్గమైన తంబళ్లపల్లెలో అభివృద్ధి కార్యక్రమాల పై దృష్టి సారించాలని, తంబళ్లపల్లి లో వై.ఎస్.ఆర్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. 

శ్రీకాళహస్తి  శాసనసభ్యులు మాట్లాడుతూ పెదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. 

పలమనేరు శాసనసభ్యులు మాట్లాడుతూ విద్యుత్ శాఖకు సంబందించి ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోయిన వెంటనే వాటిని తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని , విద్యా శాఖకు సంబందించి పలమనేరు నియోజకవర్గంలో కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. 

సత్యవేడు శాసనసభ్యులు మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పరిధిలో విద్యుత్ శాఖ లో సిబ్బంది కొరత సమస్యల పరిష్కారం కు చర్యలు చేపట్టాలని తెలిపారు. జగనన్న కాలనీలలో విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని తెలిపారు.

పూతలపట్టు శాసనసభ్యులు మాట్లాడుతూ నాడు – నేడు కార్యక్రమం క్రింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని  తెలిపారు. 

ఎం.ఎల్.సి యండవల్లి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ  ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించిన ఆస్తులను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం విద్య,  వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ నాడు – నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపు రేఖాలను మార్చుతున్నారని తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 7 లక్ష ల విద్యార్థుల సంఖ్య పెరిగిందని మన జిల్లాలో సుమారు 80 వేల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, కోవిడ్ సమయంలో స్విమ్స్, రుయా ఆసుపత్రులు బాగా పని చేశాయని  అభినందించారు.

ఎం.ఎల్.సి. రాజసింహులు మాట్లాడుతూ రైతులకు డ్రిప్ పరికరాలను అందజేయాలని, మామిడి రైతులకు రావలసిన బకాయిలను ఇవ్వాలని కోరారు. 

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్ కార్యక్రమంకు సంబందించి జిల్లా వ్యాప్తంగా ఇళ్ల మంజూరు కొరకు అందుతున్న అర్జీలను పరిశీలించి అర్హులకు ఇళ్ళు మంజూరు చేయడం జరుగుతుందని, అటవీ శాఖా భూములకు సంబందించి మంత్రులు తెలిపిన అంశాలపై రెవెన్యూ , అటవీ శాఖా సమన్వయంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని , నవశకం సర్వేలో భాగంగా జరిగిన  పింఛన్ల వెరిఫికేషన్ పై ఫిర్యాదులు అందిన చోట  మరలా వెరిఫికేషన్ చేసి అర్హులకు పింఛన్ మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. 

జిల్లాలో 1312 సచివాలయాలు కలవని ఇందులో 10,639 మంది కార్యదర్శులు 20,589 మంది వాలెంటీర్లు పనిచేస్తున్నారని , సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలో జిల్లా సచివాలయ వ్యవస్థలో జిల్లా రెండో స్థానంలో కలదని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వివరించారు.

పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 1,74,240 ఇళ్ళు మంజూరు కాగా ఇవన్నీ వివిద దశల్లో పురోగతిలో ఉన్నదని , స్వయం సహాయక సంఘాల మహిళలకు డి ఆర్ డీ ఎ , మెప్మా ల ద్వారా రుణాలను అందించి గృహాల నిర్మాణానికి కృషి చేస్తున్నామని , జగనన్న కాలనీలలో అన్ని మౌలిక వసతుల కల్పనకు  చర్యలు చేపట్టామని జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) వివరించారు. 

  సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఏప్రిల్ 2021  నుండి జగనన్న వసతి దీవెన ద్వారా  91,495 మంది లబ్ధిదారులకు రూ. 89.50 కోట్లు , జగనన్న విద్యా దీవెన క్రింద 95,133 మంది లబ్ధిదారులకు రూ.113.39 కోట్లు , వై.ఎస్.ఆర్ కాపు నేస్తం క్రింద 16,221 మంది లబ్ధిదారులకు రూ.24.33 కోట్లు, వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ క్రింద 2,12,758 మంది లబ్ధిదారులకు రూ.143.9 కోట్లు, వై.ఎస్.ఆర్ చేయూత క్రింద  2,14,455 మంది లబ్ధిదారులకు రూ.402.1 కోట్లు , వై.ఎస్.ఆర్ రైతు భరోసా క్రింద 4,60,389 మంది లబ్ధిదారులకు రూ.345.29 కోట్లు , వై.ఎస్.ఆర్ ఉచిత పంటల భీమా క్రింద 1,19,548  మంది లబ్ధిదారులకు రూ.37.87 కోట్లు , వై.ఎస్.ఆర్  నేతన్న నేస్తం  క్రింద 6155 మంది లబ్ధిదారులకు రూ.14.77 కోట్లు,  వై.ఎస్.ఆర్ వాహన మిత్ర క్రింద 1,70,77 మంది లబ్ధిదారులకు రూ.17.07 కోట్లు లతో పాటు సంక్షేమ పథకాల ప్రగతిని జిల్లా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) వివరించారు.

ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా  ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగష్టు వరకు 1.35 కోట్లు పని దినాలు కల్పించడం లక్ష్యం కాగా లక్ష్యాన్ని అదిగమించి 1.38 కోట్ల పని దినాలను కల్పించి రాష్ట్రం లోనే మొదటి స్థానంలో నిలిచామని , పంచాయితీ రాజ్ శాఖ కు సంబండిచి గ్రామ సచివాలయాల నిర్మాణాలలో భాగంగా 1016 పనులు మంజూరు కాగా 297 పనులు పూర్తి చేసి 685 పనులు వివిద దశల్లో కలవని , రైతు భరోసా కేంద్రాలకు సంబందించి 924 పనులు మంజూరు కాగా 183 పనులు పూర్తి చేసి  684 పనులు పురోగతి లో ఉన్నవని, వై.ఎస్.ఆర్ హెల్త్ క్లినిక్ లకు సంబందించి 721 పనులు మంజూరు కాగా 55 పనులు పూర్తి చేసి 584 పనులు  పురోగతి లో ఉన్నవని, నాడు – నేడు కు సంబందించి పది విభాగాల క్రింద మొదటి దశలో 1533 పాఠశాలలు గుర్తించి 1402 పాఠశాలల్లో రూ.294.51 కోట్లు తో పనులు పూర్తి చేశామని , మిగిలిన పనులు పురోగతిలో ఉన్నవని జగనన్న విద్యా కానుక క్రింద 1,39,197 మంది విద్యార్థులకు రూ.23.22 కోట్లతో  కిట్లను అందజేయడం జరిగిందని, వ్యవసాయానికి సంబందించి ఈ – క్రాప్ బుకింగ్ లో రాష్ట్రం లో జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నదని,  946  రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు  సబ్సిడీతో అందజేయడం జరుగుతున్నదని , హార్టికల్చర్ కు సంబందించి జిల్లా వ్యాప్తంగా 2,10,555 హెక్టార్లలో ఉద్యాన పంట లు సాగులో ఉన్నాయని ఇందులో అత్యధికంగా మామిడి పంట 1,12,189 హెక్టార్లలో కలదని, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ కు సంబందించి జల జీవన్ మిషన్ క్రింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కు చర్యలు చేపడుతున్నట్లు , ఇరిగేషన్ కు సంబందించి జిల్లాలో రూ.100 కోట్లతో సత్యవేడు, చంద్రగిరి, నగిరి, మదనపల్లి, చిత్తూరు, పూతలపట్టు, జి.డి.నెల్లూరు లలో ఇరిగేషన్ పనులు జరుగుతున్నట్లు సంబందిత శాఖ అధికారులు సమీక్షలో భాగంగా మంత్రులకు వివరించారు. 

ఈ సమీక్షా సమావేశంలో డీ సీ సీ బీ ఛైర్మన్  రెడ్డెమ్మ, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద, పంచాయితీ రాజ్ , ఆర్ డబ్ల్యూ ఎస్, ట్రాన్స్ కో , ఇరిగేషన్, ఎస్.ఈ.లు అమరనాథ్ రెడ్డి, విజయకుమార్, చలపతి, విజయకుమార్ , వ్యవసాయ శాఖ జె.డీ. దొరస్వామి, డ్వామా,  డీ.ఆర్.డీ. ఎ పి.డీ. లు చంద్రశేఖర్, తులసి , హౌసింగ్ పి.డి. పద్మనాభం , డి.ఈ.ఓ పురుషోత్తం, సమగ్ర శిక్షా ఎ.పి.సి. వెంకటరమణా రెడ్డి , వివిద శాఖల  జిల్లా స్థాయి అధికారులు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments