కాకాణి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం"

 *"కాకాణి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం"*




శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, నేలటూరుపాళెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


రోడ్లు, తాగునీటి పథకాలు, "నాడు-నేడు" పథకం కింద అభివృద్ధి చేసిన పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.


పిల్లలకు "విద్యా దీవెన" కిట్లు పంపిణీ చేసి, గ్రామంలో చెట్లు నాటిన ఎమ్మెల్యే కాకాణి.


గ్రామంలోని చెత్తను తరలించడానికి పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించి, పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.


రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగించడాన్ని, తెలుగుదేశం నాయకులు తప్పుపడుతున్నారు.

 ప్రభుత్వం అప్పులు చేస్తుందనీ ప్రచారం చేస్తూ, పేదవాడికి సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందకుండా, అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు.

 కరోనా కష్టకాలంలో స్కూళ్లకు పోని పిల్లలకు *"అమ్మఒడి", "విద్యా దీవెన", "వసతి దీవెన"* లాంటి పథకాలు అవసరమా!, అంటూ ప్రశ్నిస్తున్నారు.

 కోవిడ్ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడమే ధ్యేయంగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

 సర్వేపల్లి నియోజకవర్గంలో సమగ్రంగా అంతర్గత రోడ్లు, డ్రైన్లు నిర్మించి, ప్రజలకు అవసరమైన తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం.

 ముత్తుకూరులో ఏర్పడిన పరిశ్రమల వల్ల కాలుష్యం తప్ప, స్థానిక ప్రజలకు ఒరిగిందేమీ లేదు.

 ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్ కో యాజమాన్యంతో మాట్లాడి, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా.

 కాలుష్య కోరల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న గ్రామాల ప్రజలకు, త్వరలోనే సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, తరలిస్తాం.

 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేస్తా.

Comments