సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి :*సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి :


-*


*జిల్లాలో ఏ ఒక్కరూ డెంగ్యూ, మలేరియా వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకోవాలి :-*


*అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు :-*


కర్నూలు, ఆగస్టు 31 (ప్రజా అమరావతి):


*సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు వైద్యాధికారులను ఆదేశించారు.*


*మంగళవారం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ లో   నంద్యాల డివిజన్ స్థాయిలో సీజనల్‌ వ్యాధుల పై అధికారులతో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.*


*జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, డిఎమ్ హెచ్ ఓ డాక్టర్ రామగిడ్డయ్య, నంద్యాల డివిజన్ స్ధాయి, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.*


*జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ...జిల్లాలో ఏ ఒక్కరూ డెంగ్యూ, మలేరియా వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలని, సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని, వైద్యాధికారులు పీహెచ్‌సీలకు అందుబాటులో ఉండి చికిత్సలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వైద్యాధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలు, ఇంటింటి సర్వే నిర్వహణ ద్వారా వ్యాధుల బారిన పడిన ప్రజలను గుర్తించి చికిత్సలు అందించాలన్నారు. వర్షాకాలం అయినందున హెల్త్‌ క్యాంపుల ద్వారా గ్రామాలు, అర్బన్‌ ప్రాంతాల్లో పర్యవేక్షించాలని, సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, డయేరియా వ్యాధులు తలెత్తకుండా  గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పారిశుధ్య చర్యలు తీసుకునేలా చూడాలని తెలిపారు. ఎక్కడైన మలేరియా, డెంగ్యూ వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.*


*కరోనా నేపథ్యంలో సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా వుండాలని, అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేసి నిర్దారించుకోవాలన్నారు. గ్రామాల్లో పట్టణాల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఐఆర్ఎస్, ఫాగింగ్ తదితర లార్వా నియంత్రణ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. వారి వారి నివాసాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, దోమకాటు బారిన పడకుండా పిల్లలు, వృద్ధులను కాపాడుకోవాలని అందుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈ వానాకాలం సీజన్ ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా వుంటూ సీజనల్ వ్యాధులను నియంత్రించే చర్యలు చేపట్టాలన్నారు. దోమల నివారణకు యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ నిర్వహణ, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహణ చేపట్టాలన్నారు.*