లింగవరం గ్రామంలో కొల్లారెడ్డి రామిరెడ్డి -సుశీలమ్మ గార్ల కళ్యాణ మండపం

 



- లింగవరం గ్రామంలో కొల్లారెడ్డి రామిరెడ్డి -సుశీలమ్మ గార్ల కళ్యాణ మండపం 


- నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి కొడాలి నాని 

- రాఘవరెడ్డి, రామిలింగారెడ్డిలకు ఘన సత్కారం 



గుడివాడ, ఆగస్టు 12 (ప్రజా అమరావతి): గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామంలో కొల్లారెడ్డి రామిరెడ్డి- సుశీలమ్మ గార్ల కళ్యాణ మండపం నిర్మాణానికి రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) గురువారం భూమిపూజ, శంఖుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శాస్రోక్తంగా పూజలు జరిపారు. లింగవరంలో గ్రామస్థులు శుభకార్యాలను జరుపుకునేందుకు ఎటువంటి కళ్యాణ మండపాలు అందుబాటులో లేవు. దీంతో కొందరు పరిసర ప్రాంతాల్లోని కళ్యాణ మండపాల్లో, మరికొందరు ఇళ్ళ దగ్గర ఫంక్షన్లను జరుపుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో లింగవరం గ్రామంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త కొల్లారెడ్డి రాఘవరెడ్డి, ప్రముఖులు గాదిరెడ్డి రామలింగారెడ్డి, గాదిరెడ్డి చిరంజీవిరెడ్డి తదితరులు ముందుకు వచ్చారు. మంత్రి కొడాలి నాని కూడా కళ్యాణ మండపం నిర్మాణానికి తనవంతు కృషి చేస్తున్నారు. శంఖుస్థాపన అనంతరం గ్రామ పెద్దలతో కలిసి మంత్రి కొడాలి నాని కళ్యాణ మండపాన్ని నిర్మించే స్థలం, పరిసరాలను పరిశీలించారు. అన్ని హంగులతో లింగవరంలో కళ్యాణ మండపాన్ని నిర్మించనున్నారు. ఇక్కడ కళ్యాణ మండప నిర్మాణం పూర్తయితే లింగవరం, పరిసర ప్రాంత ప్రజలు అవసరమైన సమయాల్లో శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లను జరుపుకునే వీలు కలుగుతుంది. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త కొల్లారెడ్డి రాఘవరెడ్డిని, ప్రముఖుడు గాదిరెడ్డి రామలింగారెడ్డిని పూలమాలలతో మంత్రి కొడాలి నాని సత్కరించారు. కళ్యాణ మండపం నిర్మాణానికి రాఘవరెడ్డి రూ. 50 లక్షలు, రామలింగారెడ్డి రూ. 10 లక్షలు, గాదిరెడ్డి చిరంజీవిరెడ్డి రూ. 10 లక్షలు అందజేయడం అభినందనీయమని మంత్రి కొడాలి నాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, ప్రముఖులు గాదిరెడ్డి హేమసుందరరెడ్డి, మలిరెడ్డి నరసారెడ్డి, మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కే ఏడుకొండలు, అర్జునరావు, పోలుకొండ కోటేశ్వరరావు, కానుమోలు ఓంకార్, గాదిరెడ్డి మనోహర్ రెడ్డి, మందపాటి శివరామకృష్ణ, మందపాటి గోపాలస్వామి, కళ్ళేపల్లి శంకరరావు, పాలడుగు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments