*- నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి కొడాలి నాని*
విజయవాడ, ఆగస్టు 24 (ప్రజా అమరావతి):
విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ బత్తిన శ్రీనివాసులు గారి కుమార్తె చి.ల.సౌ పావని మనోజ్ఞ - చి. ప్రణీష్ సాయి గార్ల వివాహానంతర రిసెప్షన్ వేడుకలు విజయవాడ నగరంలోని గేట్వే హోటల్ లో ఉన్న వివంత కన్వెన్షన్ హాల్ లో మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. నూతన వధూవరులను రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) ఆశీర్వదించారు. వేదికపై రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యేలు జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్ లతో కలసి మంత్రి కొడాలి నాని శ్రీ బత్తిన శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో చాలాసేపు ముచ్చటిస్తూ, ఆహ్లాదంగా గడిపారు. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేసి నూతన వధూవరులను దీవించి ఆశీర్వదించారు.
addComments
Post a Comment