ఈ - కేవైసీపై ప్రజలకు మరింత అవగాహన కల్పించండి

- ఈ - కేవైసీపై ప్రజలకు మరింత అవగాహన కల్పించండి 


- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 

- మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్వో  మారుతీ ప్రసాద్ గుడివాడ, ఆగస్టు 30 (ప్రజా అమరావతి): ఈ - కేవైసీపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. గుడివాడ పట్టణంలో రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని డీఎస్వో కేవీఎస్ మారుతీ ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రాష్ట్రంలోని బియ్యం కార్డుల్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ - కేవైసీ చేయించుకోవాలన్నారు. ఈ - కేవైసీ చేయించుకున్న కార్డుదారులు పోర్టబులిటీ సదుపాయం ద్వారా నిత్యావసర రేషన్ సరుకులను దేశంలో ఎక్కడి నుండైనా పొందే హక్కు కలుగుతుందన్నారు. గ్రామ , వార్డు వాలంటీర్ దగ్గర ఉన్న బయోమెట్రిక్ యంత్రం ద్వారా కూడా ఈ - కేవైసీ చేయించుకోవచ్చన్నారు. రేషన్ డీలర్ దగ్గర ఉన్న ఈ - పాస్ యంత్రం ద్వారా కూడా చేయించుకునే అవకాశం ఉందన్నారు. వేలిముద్రలు సరిగా పడని వారు ఈ - పాస్ యంత్రం ద్వారా ఫ్యూజన్ ఫింగర్ సదుపాయం వినియోగించుకోవచ్చన్నారు. ఐదేళ్ళ లోపు పిల్లలకు ఈ - కేవైసీ అవసరం లేదన్నారు. బియ్యం కార్డుల రద్దుపై అనుమానాలు, అపోహలు లేకుండా చూడాలన్నారు. ఈ - కేవైసీ కేవలం ఆధార్ ద్వారా వ్యక్తిగత ధృవీకరణ మాత్రమేనని, బియ్యం కార్డులను తొలగించే ప్రక్రియ కాదని మంత్రి కొడాలి నాని తెలిపారు.

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image