శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):   #33-3-32A, కార్తికేయ నిలయం, రామానాయుడు వీధి, విజయవాడకు చెందిన మెడికల్ అసోసియేషన్ ఈసీ మెంబర్, బజరంగ్దళ్ విజయవాడ సభ్యులు శ్రీ అవుటపల్లి శివప్రసాద్ గారు మరియు కుటుంబ సభ్యులు వారి తల్లి గారు అవుటుపల్లి వీర రాఘవమ్మ గారి  జ్ఞాపకార్థం శ్రీ అమ్మవారి  ఆలయం నందు ప్రతిరోజు జరుగు నిత్యాన్నదానము నిమిత్తము రూ.1,00,000/-లు రూపాయలను ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు చెక్కు రూపంలో విరాళంగా అందజేశారు. మరియు సుమారు రూ.7500/- లు విలువ జేయు వీల్ చైర్ ను వృద్దులు మరియు ప్రత్యేక ప్రతిభావంతులైన భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నకు అందజేశారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ  అమ్మవారి దర్శనం కల్పించి అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీఅమ్మవారి ప్రసాదం అందజేసినారు..

Comments