*జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ , గ్రంథాపాలకుల దినోత్సవా వేడుకలు
.*
ఖమ్మం (ప్రజా అమరావతి) స్వాతంత్య్రం వచ్చి 75 సం॥ పురస్కరించుకొని ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయం ఖమ్మం నందు పుస్తక ప్రదర్శన బుక్ కార్జర్ ను నిర్వహించారు . ఈ పుస్తక ప్రదర్శనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ యం.డి. అజీజ్ - ఉల్ - హక్ (ఖమర్) గారు ప్రారంభించారు . అనంతరం వారు మాట్లాడుతూ మనకు ఇపుడు ఉన్న ఈ స్వాతంత్రం ఎంతో మంది మహనీయుల ప్రాణత్యాగల వలన వచ్చిన స్వేచ్చా అని అన్నారు . అలాగే ఈ రోజు గ్రంథాపాలకుల దినోత్సవం పురస్కరించుకొని శ్రీ ఎస్ . ఆర్ . రంగనాదన్ గారి జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు . తొలుతు విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అని అందరూ కూడా గ్రంథాలయాలను వినియోగించుకొని వారి లక్ష్యాలను చేరుకోవాలి అని కోరారు . ఈ కార్యక్రమములో కార్యదర్శి ఏ.మంజువాణి , ఏ.కనకవల్లి , అసిస్టెంట్ లైబ్రేరియన్ ఆర్.నాగన్న , అఖిల్ , జి.కోటేశ్వరరావు , లక్ష్మి , నాగమణి విద్యార్థులు పాల్గొనినారు.
addComments
Post a Comment