కరోనా థర్డ్ వేవ్ కి అన్ని విధాలా సిద్ధం కావాలి

 కరోనా థర్డ్ వేవ్ కి అన్ని విధాలా సిద్ధం కావాలి*


*: జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్*


అనంతపురం, ఆగస్టు 06 (ప్రజా అమరావతి):


కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని విధాలా సిద్ధం కావాలని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో థర్డ్ వేవ్ ప్రిపేర్డ్ నెస్ లో భాగంగా ఆక్సిజన్ మేనేజ్మెంట్ పై ఐటిఐ టీచర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్లో వైద్యులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సన్నద్ధత చాలా కీలకమన్నారు. కోవిడ్ నేపథ్యంలో వైద్య సేవలు అందించడం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదన్నారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో ఐఎంఏ వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని  ప్రభుత్వ ఆసుపత్రి   సూపర్డెంట్ ను ఆదేశించారు . ఐఎంఏ వైద్యులు 13  మంది వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని, మిగిలిన పీడియాట్రిక్, అనస్థీషియా, జనరల్ ఫిజీషియన్, చర్మ వైద్యులు, తదితర వైద్యులను నియమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఐఎంఏ వైద్యుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలన్నారు. త్వరలో వైద్యులతో నిర్వహించే సమావేశానికి థర్డ్ వేవ్ నేపథ్యంలో పేషెంట్లకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సదుపాయాల వివరాలు, ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ పనులు ఎక్కడ ఎలా చేస్తారు అనే వివరాలు, బయోమెడికల్ రిక్రూట్మెంట్ వివరాలు  ఈనెల తొమ్మిదో తేదీ లోపుసిద్ధం చేయాలన్నారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ థర్డ్ వేవ్ ప్రిపేర్డ్ నెస్ లో భాగంగా ఆక్సిజన్ మేనేజ్మెంట్ పై ఐటిఐ టెక్నికల్ టీచర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్సిజన్ మేనేజ్మెంట్ సక్రమంగా నిర్వహించి ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్సిజన్ లేక ఏ ఒక్క ప్రాణం పోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రులలో ఆక్సిజన్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పేషెంట్ కి ఎంత మోతాదులో ఆక్సిజన్ అందించాలి, ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ఉపయోగం, ఆక్సిజన్ పైప్ లైన్ లీకేజీ లు, లిక్విడ్ ఆక్సిజన్ ఎలా వాడాలి, ఆస్పత్రిలో ఎంత ఆక్సిజన్ సిద్ధంగా ఉంది, ఎన్ని రోజులకు ఆక్సిజన్ సరిపోతుంది తదితర అంశాలపై దృష్టి సారించి ఆక్సిజన్ వృధాను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్, వివిధ రకాల ఆక్సిజన్ సిలిండర్లకు మధ్య తేడాలు వాటిని వినియోగించే విధానంపై ఐటిఐ టెక్నికల్  టీచర్లకు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. 

అనంతరం  జాయింట్ కలెక్టరసిరి మాట్లాడుతూ కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఎఫెక్టివ్ ఆక్సిజన్ మేనేజ్ మెంట్ ద్వారా ఎక్కువ మంది ప్రాణాలను కాపాడగలమన్నారు. ఎఫెక్టివ్ మేనేజ్ మెంట్ అంటే బ్రహ్మపదార్థం కాదని కేవలం వెంటిలేటర్ల వినియోగం, నిల్వ ఉన్న ఆక్సిజన్ తో ఎంతమందికి ఎంతసేపు ప్రాణవాయువు అందించొచ్చు, ఆక్సిజన్ అవసరం ఏయే సమయాల్లో ఉంటుంది, కరోనా తీవ్రత పెరిగినప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి అవగాహన కలిగి ఉండి అవసరమైనప్పుడు ఆ మేరకు క్షేత్ర స్థాయిలో చర్యకు ఉపక్రమించడమేనన్నారు. 

శిక్షణా కార్యక్రమం అనంతరం సర్వజన ఆసుపత్రిలోని ఆక్సిజన్ వెంటిలేటర్ ను పరిశీలించారు. 

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ జగన్నాథ్, డిప్యూటీ సూపరింటెండెంట్ నవీద్ అహ్మద్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నీరజ, సిఎస్ ఆర్ఎంఓ విశ్వనాథయ్య, డిప్యూటీ ఆర్ఎంఓలు విజయమ్మ, వెంకటేశ్వరరావు, డాక్టర్లు, భానుమూర్తి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Comments