జిల్లాలోని 17 పి.హెచ్.సి.ల పరిధిలో శతశాతం వ్యాక్సినేషన్
జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణకుమారి
విజయనగరం, సెప్టెంబరు 12 (ప్రజా అమరావతి); జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కోవిడ్ టీకాలు వేయడంలో శతశాతం లక్ష్యాలను సాధించాయని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారి వెల్లడించారు. జిల్లాలోని మక్కువ పి.హెచ్.సి. అత్యధికంగా లక్ష్యాన్ని మించి 124 శాతం వ్యాక్సినేషన్ చేసినట్టు పేర్కొన్నారు. విజయనగరం పట్టణ పరిధిలోని లంకాపట్నం, పూల్ బాగ్ కాలనీ అర్బన్ పి.హెచ్.సి.లు, పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం వందశాతం వ్యాక్సినేషన్ సాధించాయన్నారు. జియ్యమ్మవలస మండల పరిధిలోని జియ్యమ్మవలస, ఆర్.ఆర్.బి.పురం పి.హెచ్.సిలు, పార్వతీపురంలోని బందలుప్పి, రామభద్రపురంలోని ఆరికతోట, బొబ్బిలిలోని పిరిడి, బొండపల్లిలోని దేవుపల్లి, నెల్లిమర్లలోని కొండవెలగాడ, సాలూరులోని మామిడిపల్లి, మెంటాడ, జి.ఎల్.పురంలోని దుడ్డిఖల్లు, కొమరాడలోని కె.ఆర్.బి.పురం, కురుపాంలోని నీలకంఠాపురం, ఎస్.కోటలోని బొద్దాం పి.హెచ్.సిలు ఆదివారం నాటికి శతశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశాయన్నారు. తెర్లాం మండలంలోని పెరుమాలి పి.హెచ్.సి. 99.6శాతం, నెల్లిమర్ల మండలం సతివాడ పి.హెచ్.సి. 99శాతం లక్ష్యాలు పూర్తిచేసి శతశాతం వ్యాక్సినేషన్‌కు చేరువలో ఉన్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని మరో 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 90శాతంకు పైగా వ్యాక్సిన్ లక్ష్యాలు చేరుకొని శతశాతం పూర్తిచేసేందుకు దగ్గరలో వున్నట్టు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి సారధ్యంలో, జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ పర్యవేక్షణలో జిల్లాలోని వైద్యాధికారులు, సిబ్బంది, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సినేషన్ లక్ష్యాలు సాధించడంలో చేస్తున్న కృషిని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి అభినందించారు. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి అన్ని పి.హెచ్.సిల ద్వారా శతశాతం లక్ష్యాలను పూర్తిచేయడంలో సహకరించాలని కోరారు.
addComments
Post a Comment