కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో తిలక్ స్ట్రీట్ లో ఉన్న 28-a వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్

 

కాకినాడ, సెప్టెంబర్ 01, (ప్రజా అమరావతి).


బుధవారం కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో తిలక్ స్ట్రీట్ లో ఉన్న 28-a వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్


సి.హరికిరణ్, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వీస్ రిక్వెస్ట్ లు, పింఛన్ల పంపిణీ, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన రిజిస్టర్ లను కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

       ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సకాలంలో అర్హులైన లబ్ధిదారులు అందరికీ అందేవిధంగా చూడాలన్నారు. వివిధ సేవల నిమిత్తం వార్డు సచివాలయంకి వస్తున్న దరఖాస్తులను పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించాలని  వార్డు సచివాలయ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.

      ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు, వార్డు సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

    

Comments