ప్రత్యేక హెలికాప్టర్లో 5.35 గంటలకు ఇడుపులపాయకు బయలుదేరిన ముఖ్యమంత్రి.



  


 వైఎస్ఆర్ జిల్లా కడప: ఇడుపులపాయ (ప్రజా అమరావతి);

సెప్టెంబర్ 1వ తేదీ బుధవారం సాయంత్రం విజయవాడ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 5.10గం.లకు కడప విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

అనంతరం అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక హెలికాప్టర్లో 5.35 గంటలకు ఇడుపులపాయకు బయలుదేరిన ముఖ్యమంత్రి.


 5.50 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు ఎస్. రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  బ్రిజేంద్రనాథ రెడ్డి, కలెక్టర్ వి.విజయరామరాజు, జాయింట్ కలెక్టర్లు సి.ఎం.సాయి కాంత్ వర్మ, హెచ్ఎం. ధ్యానచంద్ర,  పరిశ్రమల శాఖ సలహాదారు రాజోలి వీరారెడ్డి, పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ తిరుపాల్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లి మల్లిఖార్జున రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, ప్రముఖ నాయకులు వైయస్ మనోహర్ రెడ్డి, వైయస్ మధుసూదన్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఇటీవల నూతనంగా ఎంపికైన మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, ఇతర అధికారులు తదితరులు ఇడుపులపాయలో ముఖ్యమంత్రికి సాదరంగా ఆహ్వానం పలికారు. 

ఆహ్వానం పలికిన వారిని పేరు పేరునా ఆత్మీయంగా పలకరించిన ముఖ్యమంత్రి.

కోవిడ్ నేపథ్యంలో ఇడుపులపాయలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ (SoP) మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని  గురువారం(రేపు) ఉదయం ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.

 

Comments