7 బ్రాండ్లతో శ్రీవారి అగరబత్తీలు

 *7 బ్రాండ్లతో శ్రీవారి అగరబత్తీలు


*


*తుది దశకు చేరుకున్న తయారీ ప్రక్రియ* 


*13 నుంచి విక్రయాలకు ఏర్పాట్లు*


తిరుమల (ప్రజా అమరావతి): తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళభరిత అగరబత్తీలు తయారు చేసి భక్తులకు విక్రయానికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.        


శ్రీవారి ఏడు కొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో సెప్టెంబర్‌ 13వ తేదీ నుంచి అగరబత్తీల విక్రయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.     


టీటీడీ ఆలయాల్లో పూజలు,అలంకరణలకు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. 


పర్వదినాలు,ఉత్సవాల సమయంలో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది.                   


ఇలా ఉపయోగించిన పుష్పాలన్నీ మరుసటి రోజు ఉదయం తొలగిస్తారు.


స్వామి సేవకు ఉపయోగించిన పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగించే విషయంపై టీటీడీ ఆలోచన చేసింది. 


బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ టీటీడీ ఆలయాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాలను అందిస్తే లాభం లేకుండా అగరబత్తీలు తయారు చేసి అందిస్తామని ముందుకు వచ్చింది.        


ఈ మేరకు ఆ సంస్థతో టీటీడీ అవగాహన కుదుర్చుకుని ఎస్వీ గోశాలలో అగరబత్తీల తయారీకి అవసరమైన స్థలం కేటాయించింది.          


దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ తన సొంత ఖర్చులతో యంత్రాలు,సిబ్బందిని నియమించుకుని కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా అగరబత్తీల ఉత్పత్తిని ప్రారంభించింది.


తయారీ ఇలా..

టీటీడీ స్థానిక ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఉద్యానవన విభాగం సిబ్బంది ఎస్వీ గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రానికి తరలిస్తారు.        


ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వీటిని రకాల వారీగా పుష్పాలను వేరు చేసి వాటిని డ్రైయింగ్‌ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు.                    


ఆ పిండికి నీరు కలిపి కొన్ని పదార్థాలతో మిక్సింగ్‌ చేస్తారు.                         


ఈ మిశ్రమాన్ని మరో యంత్రంలో వేసి అగరబత్తీలు తయారు చేస్తారు.                    


వీటిని ప్రత్యేక యంత్రంలో 15 నుంచి 16 గంటల పాటు ఆరబెట్టిన తరువాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావకంలో ముంచుతారు. 


చివరగా వీటిని మరోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్‌ చేస్తారు.     


మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తీలు తయారు చేసేలా ఏర్పాట్లు చేశారు.


*పవర్ ఆఫ్ ఆర్టీఐ*

Popular posts
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కొడాలి నాని
Image
ముఖ్యమంత్రి హెూదాలో పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం పెట్టిన వైఎస్సార్ ను ఎలా మర్చిపోగలం
Image
ప్రజల గుండెల్లో చురస్మరణీయమైన స్థానం పొందిన వ్యక్తి నారా లోకేష్
Image
ఎన్టీఆర్ అభిమానిగా సీఎం జగన్మోహనరెడ్డికి పాదాభివందనం చేస్తున్నా
Image
మెడల్ హౌస్.... - రూ. 3.24 లక్షల్లోనే డబుల్ బెడ్‌రూం ఇల్లు - 15 రోజుల్లో పదిమంది కూలీలతో నిర్మాణం - కరీంనగర్‌లో యువబిల్డర్ ప్రయోగం సక్సెస్ ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రెండు పనులూ కష్టసాధ్యమనే ఉద్దేశంతోనే అలా చెప్పారు. ఇప్పుడు రోజులు మారాయి. అంతా రెడీమేడ్ యుగం. కేవలం పదిహేను రోజుల్లోనే డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించవచ్చు! మీరు విన్నది నిజమే. కరీంనగర్ శివారు బొమ్మకల్ బైపాస్ సమీపంలో నిర్మించిన ఈ ఇంటిని చూస్తే మాత్రం ఇల్లు కట్టడం ఇంత సులభమా? అనిపించకమానదు. అతితక్కువ ఖర్చుతో రెండు పడకగదులున్న పక్కాభవంతిని కట్టి చూపించాడు కరీంనగర్‌కు చెందిన యువబిల్డర్ పేరాల కృష్ణారావు. వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఈయన, కేవలం పదిమంది కూలీలతో 15 రోజుల్లో రూ.3.24 లక్షల తో ఈ ఇంటిని నిర్మించారు. దీనికి మోడల్ హౌస్ అని నామకరణం కూడా చేసేశారు. డిజైన్‌లో మార్పులు చేస్తే కేవలం రూ.3 లక్షల్లో నిర్మించి ఇవ్వవచ్చని చెప్తున్నారు. ఇదీ ఇంటి ప్లాన్: 128 చదరపు గజాల(1155 చదరపు అడుగుల) స్థలంలో 510 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా (కింది విస్తీర్ణం), 815 చదరపు అడుగుల స్లాబ్ ఏరియా(పైన స్లాబ్ విస్తీర్ణం)తో ఇల్లు ఉంటుంది. మెట్లు పోను 10 ఫీట్లు, ఇంటిపక్కన 8 ఫీట్లు ఖాళీ స్థలం మిగులుతుంది. నిర్మాణం ఇలా: మొదట కందకం తీసి, బేస్‌మెంట్ నిర్మించారు. పిల్లర్లు, గోడలు, స్లాబ్ కోసం ఒకరోజులో అల్యూమినియం ఫ్రేమ్‌లు బిగించారు. తలుపులు, కిటికీలు అమర్చా రు. మరోరోజు రాడ్లు నిలిపి, అల్లారు. మరుసటి రోజు రెడీమిక్స్‌తో కాంక్రీట్ నింపారు. తర్వాత అల్యూమీనియం ఫ్రేం లను తొలగించి, నాలుగు నుంచి ఐదురోజులు క్యూరింగ్ చేశా రు. ఈ ఇంటికి ప్లాస్టరింగ్ అవసరం ఉండదు. అందుకే కొద్ది గా లప్పం కోటింగ్ చేసి, మిషన్ ద్వారా ఒకేరోజు కలర్ కూడా వేసేయొచ్చు. మిగిలిన రోజులు చిల్లరపనులకు పోతుంది. ఖర్చు పెట్టారిలా: గోడలు, స్లాబ్‌కు 33 క్యూబిక్‌మీటర్ల కాం క్రీట్ మిక్స్ (రెడీమిక్స్) సరిపోయింది. క్యూబిక్‌మీటర్‌కు రూ.2800చొప్పున రూ.84వేల ఖర్చు వచ్చింది. రెండు టన్నుల రాడ్‌కు రూ.85వేలు. నాలుగు తలుపులు, కిటికీలకు రూ.25వేలు. మేస్త్రీ, కూలీలకు రూ.60వేలు. కరెంట్ ఖర్చు రూ.15వేలు, ప్లంబర్ చార్జి రూ.15వేలు. మొత్తం రూ.3.24 లక్షలు. ధరలు పెరిగినా, డిజైన్‌లో మార్పు ఉన్నా ధరల్లో కొం త వ్యత్యాసం ఉండవచ్చు. ఎలివేషన్(ఇంటి ముందు భాగపు డిజైన్) మారిస్తే మరో రూ.60వేలు అదనపు ఖర్చు ఉంటుం ది. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తే ఖర్చు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది. చైనా, జర్మనీల్లో చూసి ప్లాన్‌చేశారు పేరాల కృష్ణారావు, ఎండీ, వాల్యూ కన్‌స్ట్రక్షన్స్ ఇంటి నిర్మాణానికి మనం పెట్టే ఖర్చు ప్రపంచంలో ఎక్కడా పెట్టరు. తక్కువ ఖర్చుతో ఇల్లు ఎలా నిర్మించవచ్చో తెలుసుకునేందుకు చైనా, జర్మనీ, అమెరికాలో పర్యటించారు. చైనా, జర్మనీల్లో కాంక్రీట్ గోడలు, రోబోసాండ్‌తో ఇండ్లను నిర్మిస్తున్నారు. ఇది నాకు నచ్చింది. పేద ప్రజల కలను నిజం చేసేందుకు ఈ విధానం సరిపోతుంది. అందుకే ఈ ఇంటిని కట్టి మోడల్ హౌస్ అని పేరుపెట్టారు
Image