చిత్తూరు, సెప్టెంబర్ 07 (ప్రజా అమరావతి): జిల్లాలో 2021-22 సం.లకు క్రొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం రూ. 1250/- cfms.ap వెబ్ సైట్ నందు HOA : 8342–00–120 -01-03-001-001 VN, DDO Code : 2703– 0802–003 పద్దుకు చెల్లించి స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2021-22 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, 31 మార్చి, 2022 వరకు అమలులో ఉండే ఈ పథకానికి జర్నలిస్టు వాటాగా రూ. 1250/- చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ. 1250/- లను చెల్లిస్తుందని కలెక్టర్ తెలిపారు. కావున జిల్లా లోని అక్రెడిటెడ్ జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు రెన్యూవల్ అయితే ఒరిజనల్ చలానా, లేటెస్ట్ అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీ, హెల్త్ కార్డు జిరాక్స్ కాపీలను, కొత్తగా ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు అయితే ఒరిజనల్ చలానా, లేటెస్ట్ అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీ, జర్నలిస్టు మరియు వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు నకలు మరియు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను jpeg ఫార్మాట్ లో పొందుపరచి సాఫ్ట్ కాపీ మరియు హార్డ్ కాపీలను ఉప సంచాలకులు, సమాచార, పౌరసంబంధాల శాఖ, చిత్తూరు కార్యాలయంలో అందజేయవలసిందిగా వారు తెలిపారు.
addComments
Post a Comment