*"యానాది కుటుంబాలకు కాకాణి చేతులమీదుగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం"*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, చెముడుగుంట ఎస్టీ కాలనీలో యానాది కుటుంబాల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*సొంత ఇంటి స్థలాలు కలిగిన కుటుంబాలకు నివేశన ధ్రువీకరణ పత్రాలు(పొజిషన్ సర్టిఫికెట్) అందజేసిన ఎమ్మెల్యే కాకాణి.*
*గర్భవతులకు పౌష్టికాహారం, చిన్నారులకు వర్క్ బుక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.*
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన విధంగా ప్రతి కుటుంబానికి ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
*"నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు"* పథకం క్రింద ఇళ్లు లేని కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం.
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖరీదైన స్థలాలలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించాం.
*"వైయస్సార్ జగనన్న కాలనీ"* లలో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టా అందించే బాధ్యత నాది.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలలో సిమెంటు రోడ్లు, సైడు కాలువలతోపాటు పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం మండలానికి సిమెంట్ రోడ్లు, సైడు కాలువలకు 125 కోట్ల రూపాయలు మంజూరు చేశాం.
చెముడుగుంట ఒక్క గ్రామానికే 7 కోట్ల 70 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి గారిపై నిత్యం బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు.
ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను అడ్డుకోవడం, సంక్షేమ పథకాలు అందడంలేదని ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా తెలుగుదేశం పార్టీ లబ్ది పొందాలని చూస్తుంది.
తెలుగుదేశం పార్టీ విధానాలను గమనిస్తున్న ప్రజలు, తెలుగుదేశం పార్టీని నమ్మి ఆదరించే పరిస్థితుల్లో లేరు.
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చి, లోకేష్ ను ముఖ్యమంత్రి చేయాలని పగటి కలలు కంటున్నాడు.
పెన్షన్ల పంపిణీలో ఏదైన పొరపాట్లు జరుగుతున్నాయా! అనే విషయంపై విచారణ చేపడితే, పెన్షన్లు నిలిపివేశారంటూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా పెన్షన్లు అందిస్తున్నాం తప్ప, తెలుగుదేశం ప్రభుత్వం లాగా జన్మభూమి కమిటీల ద్వారా కాదు.
పెన్షన్ల విషయంలో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా, అర్హత కలిగిన వారందరికీ పెన్షన్లు అందిస్తాం.
సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యునిగా రెండు సార్లు అవకాశమిచ్చిన ప్రజల రుణం తీర్చుకోవడానికి నా శాయశక్తులా కృషి చేస్తా.
addComments
Post a Comment