పిల్లలు ప్ర‌యోజ‌క‌లు కావాలంటే విద్య ఒక్క‌టే ఉంటే స‌రిపోదు

 పశ్చిమ గోదావరి జిల్లా.. ఏలూరు.(ప్రజా అమరావతి); పిల్లలు ప్ర‌యోజ‌క‌లు కావాలంటే విద్య ఒక్క‌టే ఉంటే స‌రిపోదు


చ‌దువుతో పాటు ఆట‌పాటలు కూడా చాలా ముఖ్యమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కోడిపందాలు, జూదాల వైపు వెళ్లకుండా యువతకు క్రీడలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి ఆళ్ల నాని తెలిపారు..  ఏలూరు ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సంఘ సభ్యులు మంత్రి ఆళ్ల నాని గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.. ఈ సందర్భంగా జిల్లా ఫుట్ బాల్ లీగ్ టోర్నమెంట్ పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి ఆళ్ల నాని..
 క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్ వంటి క్రీడలు నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలు కూడ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తే యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుందని మంత్రి ఆళ్ల నాని చెప్పారు.. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే విధంగా యువకులకు క్రికెట్ పోటీలు, వాలీబాల్ క్రీడలు నిర్వహించే నేటి తరం యువతకు గ్రామీణ క్రీడలు పట్ల సరైన అవగాహన కల్పించడం మంచి పరిణామమని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు..
ఈ కార్యక్రమంలో ఫుట్ బాల్ ప్రెసిడెంట్ ఆలీబాబా, సెక్రటరీ నవీన్, ఏలూరు డిప్యూటీ మేయర్ లు గుడిదేశి శ్రీనివాస్ రావు, నూకపెయ్యి సుధీర్ బాబు, వైయస్సార్ సిపి నాయకులు ఎం ఆర్ డి బలరాం, ఎస్ఎంఆర్ పెదబాబు, కురెళ్ళ రాంప్రసాద్, కిలాడి దుర్గారావు, మున్నుల జాన్ గురునాథ్, నేరుసు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు..