జిల్లా వ్యాప్తంగా నూతన తహశీల్దార్ కార్యాలయాల భవనాలు నిర్మించాలి

 * నెల్లూరు పర్యటన కు విచ్చేసిన  రెవెన్యూ,స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్* 


  *ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి* 



 * నెల్లూరు ఆర్& బి అతిధి గృహంలో ఉప ముఖ్యమంత్రి తో భేటి ఆయిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్, జిల్లా కలెక్టర్, జేసీ* 


 * జిల్లా వ్యాప్తంగా నూతన తహశీల్దార్ కార్యాలయాల భవనాలు నిర్మించాలి* 


 * నూతనంగా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్మించాలి* 



 * ఉప ముఖ్యమంత్రి కి నివేదికను అందజేసినఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి* 


నెల్లూరు (ప్రజా అమరావతి);


   

*నెల్లూరు జిల్లాలో ఉన్న తహశీల్దార్ కార్యాలయాలు అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో వాటి స్థానంలో నూతనంగా తహసీల్దార్ కార్యాలయాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి రెవెన్యూ,స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ను కోరారు.* 


 *సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ నెల్లూరు నగరంలోని  ఆర్ & బి అతిథి గృహంకు* *రావడంతోరాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ కె* *వి ఎన్ చక్రధర్ బాబు,జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ లు ఘన స్వాగతం పలికారు.* 


 *ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు, అనంతరం ఆర్& బి అతిథి గృహంలోరాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు,జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ లు ఉప ముఖ్యమంత్రి తో భేటి అయ్యి పలు విషయాలు పై చర్చించారు.* 


 *ఈ సందర్భంగారాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ  నెల్లూరు జిల్లాలోని 46 మండలాల్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయాలు అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో నూతన భవనాలు నిర్మించాలి అని* 

 *అదేవిధంగా డివిజన్ కేంద్రం అయినా గూడూరు లో కూడా సబ్ కలెక్టర్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడం తో వాటి స్థానాల్లో కూడా నూతన భవనాలు నిర్మించాలి అని   ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి  మరియు రెవెన్యూ శాఖ మంత్రి  ధర్మాన కృష్ణదాస్ ను కోరడం జరిగింది అని తెలియజేశారు.* 


 *వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ లతో మాట్లాడి వెంటనే జిల్లా వ్యాప్తంగా ఉన్న తహశీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే మంత్రి క్యాంపు కార్యాలయం కు పంపాలి అని ఆదేశాలు జారీచేశారు అనీ వెల్లడించారు,అంతేకాకుండా జిల్లాలో ఉన్న పలు రెవెన్యూ సమస్యలు, రీ సర్వేలు పలు విషయాలు కూడా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.*

Comments