*" రైతుకు మోసం - తెలుగుదేశం
"*
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలోని మండలస్థాయి, గ్రామస్థాయి వ్యవసాయ సలహా మండళ్ల సభ్యుల అవగాహన సదస్సులో పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .
చంద్రబాబు రైతు కోసం - తెలుగుదేశం కాకుండా *"రైతుకు మోసం - తెలుగుదేశం"* అని పేరు పెడితే బాగుండేది.
రాష్ట్రంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలవాలనే లక్ష్యంతో, రాష్ట్రస్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ మండళ్లను ఏర్పాటు చేయడం జరిగింది.
రైతులకు అండగా నిలుస్తూ, వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రైతుల గురించి ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారు అయితే, ఆ తర్వాత వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో సకాలంలో వర్షాలు పడక, రైతులు కరువుతో అల్లాడిపోయారు.
రైతులకు రుణ మాఫీ చేస్తానని నమ్మించి, చంద్రబాబు నట్టేట ముంచాడు.
తెలుగుదేశం ప్రభుత్వంలో నీరు - చెట్టు పేరిట అంతులేని అవినీతికి పాల్పడ్డారు తప్ప, రైతాంగానికి ప్రయోజనం శూన్యం.
తెలుగుదేశం హయాంలో రైతురథం పేరిట కమీషన్ల కోసం పాకులాడటం తప్ప, రైతాంగ శ్రేయస్సు గురించి పట్టించుకోలేదు.
తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకొని, గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులకు తీరని ద్రోహం చేశారు.
రైతులను అడ్డుపెట్టుకొని దోచుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం.
చంద్రబాబు రైతు కోసం తెలుగుదేశం అంటూ.. వెరైటీ టైటిల్స్ తో కార్యక్రమం చేపట్టడం చూసి, రైతులు నవ్వుకుంటున్నారు.
చంద్రబాబు సిగ్గు, ఎగ్గు లేకుండా ముఖ్యమంత్రిగా రైతులను మోసం చేసి, దిగిపోయిన తర్వాత రైతుల గురించి ఉద్యమిస్తున్నాడు.
*"వ్యవసాయమే దండగ"* అనే చంద్రబాబుకు అధికారం ఉన్నప్పుడు రైతులు గుర్తుకు రారా..!.
చంద్రబాబు లాగా రైతుల పేరిట దోపిడీ సాగించిన ప్రభుత్వాలు, గతంలో ఎన్నడూ చూడలేదు.
వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయాలకు అనుబంధంగా, రైతు భరోసా కేంద్రాలను స్థాపించాం.
రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతాంగానికి సరఫరా చేస్తున్నాం.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల అవసరాలు తీర్చడమే కాకుండా, తగు సూచనలు, సలహాలు అందజేస్తున్నాం.
రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా లావాదేవీలు చేపట్టే రైతులకు, అధికారులు అండగా నిలవాలి.
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించాలి.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించడంతో పాటు, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర అందించాల్సిన బాధ్యత అధికారులదే.
అధికారులు సమన్వయంతో పనిచేసి, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, తగు చర్యలు చేపట్టాలి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి.
చంద్రబాబుది మాటల ప్రభుత్వం అయితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది చేతల ప్రభుత్వం.
సర్వేపల్లి నియోజకవర్గ రైతాంగానికి అన్నివిధాలా అండగా నిలిచి, సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తా.
addComments
Post a Comment