దిశ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళల భద్రతలో సమగ్రమైన మార్పు తీసుకురాబోతుంది.

 


అమరావతి (ప్రజా అమరావతి);

*స్పందనపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌*


*వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష.*


*ఈ సందర్భంగా దిశ యాప్‌పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


*దిశ యాప్‌:*

– దిశ  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళల భద్రతలో సమగ్రమైన మార్పు తీసుకురాబోతుంది. 


– దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ రూపుదిద్దుకోనుంది. 

– ఫోన్‌ను షేక్‌చేస్తే చాలు..  6 నిమిషాల్లోగా మహిళకు భద్రకల్పించేలా తీర్చిదిద్దాం.

సగటున 6 నిమిషాల్లో పోలీసు వాహనం ఘటనా స్ధలానికి చేరుకునేలా రూపొంచాం.

– దిశ యాప్‌ ద్వారా మహిళల్లో ఆ రకమైన  విశ్వాసాన్ని నింపగలిగాం.

– 70,00,520 మంది ఇప్పటివరకూ దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇది చాలా అద్భుతమైన సంఖ్య. 

– ఇందులో 3,78,571 ఎస్‌ ఓ ఎస్‌ రిక్వెస్టులు వచ్చాయి. 

– ఇందులో చర్యలు తీసుకోదగ్గవి 4,639.

– మూడు నెలల్లో దాదాపు 900 సక్సెస్‌ స్టోరీలు దిశ యాప్‌ద్వారా ఉన్నాయి.

– సక్సెస్‌ స్టోరీ అంటే... ఏదైనా జరగకముందే దాన్ని నివారించి, మహిళలకు అండగా నిలిచాం. 

– సగటున 6 నిమిషాల్లోగా దిశ వాహనం బాధితులను చేరుకుంటుంది. 

– గత ప్రభుత్వం హయాంలో ఛార్జిషీటు వేయడానికి సగటున 300 రోజులు పడితే, ఇప్పుడు 42 రోజుల్లోగా ఛార్జిషీటు వేస్తున్నాం. 

– పోలీసు విభాగం అత్యద్భుతంగా పనిచేస్తోంది. పోలీసు విభాగం పనితీరుమీద పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి.

– దేశంలో మహిళల మీద నేరాల్లో 91శాతం కేసుల్లో కేవలం 2 నెలల వ్యవధిలోనే ఛార్జిషీటు దాఖలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. 

– కేంద్ర హోంమంత్రిత్వశాఖ రికార్డుల ప్రకారం జాతీయ సగటు 35శాతంగా ఉంది.

– తిరుగులేని రీతిలో ఏపీ పోలీసు విభాగం పనిచేస్తోంది. 

– దిశ కార్యక్రమాన్ని ఎస్పీలు, కలెక్టర్లు ఓన్‌ చేసుకోవాలి.

– దిశ అనేది మీ మానస పుత్రిక. 

– కలెక్టర్లు, ఎస్పీల ప్రతిష్ఠ గణనీయంగా పెరుగుతుంది. దేశం మొత్తం మీ గురించి మాట్లాడుకుంటుంది.

– ప్రతి సచివాలయంలో మహిళా పోలీసు ఉన్నారు. వాలంటీర్లు ఉన్నారు. వీరి సేవలను వినియోగించుకోండి. 

– మహిళల వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా దిశ యాప్‌ ఉండేలా చర్యలు తీసుకోండి. 

– దీన్నొక సవాల్‌గా తీసుకోండి. గ్రామ, వార్డు సచివాలయల్లో తనిఖీలకు వెళ్తున్నప్పుడు దిశ యాప్, దిశయాప్‌ డౌన్‌లోడ్‌ను ఒక అంశం తీసుకోండి. 

– గ్రామంలోని ప్రతి ఇంట్లో కూడా దిశయాప్‌డౌన్‌ లోడ్‌ చేసుకునేలా చర్యలు తీసుకోండి. 

– కుటంబంలోని ప్రతి మహిళా చేతిలోని ప్రతి సెల్‌ఫోన్లోకూడా దిశయాప్‌ డౌన్‌ లోడ్‌ అయ్యేలా చర్యలు తీసుకోండి.

– అధిక సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదవుతున్నాయని పోలీసులు వెనుదీయనవసరం లేదు. 

– ఫిర్యాదులు రావడం, వాటిమీద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కావడం చాలామంచిది.

– ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతున్నాయనే సంశయం అవసరంలేదు.

– దిశయాప్‌ ద్వారా ఫిర్యాదులు నమోదుకు మనం అవకాశం కల్పిస్తున్నాం.

– దిశయాప్‌ ద్వారా ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యేలా మనం ప్రోత్సహిస్తున్నాం.

– ఎఫ్‌ఐఆర్‌లు ఎక్కువగా నమోదుకావడం మంచిదే. దీన్ని తప్పుగా భావించాల్సిన అవసరంలేదు. 

– ఆంధ్రప్రదేశ్‌లో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఎవరైనా వ్యాఖ్యలు చేసినా వాటి గరించి పట్టించుకోవాల్సిన అవసరంలేదు. 

– ఎక్కువ కేసులు నమోదు కావడం అంటే, ఎఫ్‌ఐఆర్‌లు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అని అంటే... మన విధిని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు లెక్క. 

ఫిర్యాదుదారులు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వస్తున్నట్టే. 

– కేరళలో ఏడాదికి 7 లక్షలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అవుతున్నాయి. 

– కేసులు సంఖ్య ఎక్కువగా నమోదు కావడాన్ని, ఎఫ్‌ఐఆర్‌లు ఎక్కువగా నమోదుకావడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరంలేదు. దీనివల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందనే ఆలోచన సరికాదు. 

– మహిళలు చైతన్యంగా ఉన్నప్పుడు, పోలీసులు స్నేహపూర్వకంగా ఉన్నప్పుడే.. ఫిర్యాదు దారులు ముందుకు రాగలుగుతారు. అలాంటి సందర్భాల్లో కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి. 

- బాధితులు నిర్భయంగా ముందుకు రాగలుగుతారు. 

–70 లక్షల మంది దిశయాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారంటే.. దాని అర్థం ఏంటంటే.. ఏ ఘటన జరిగినా ఫిర్యాదు చేయడానికి, కేసులు నమోదు చేయడానికి ఆ మహిళలకు అండగా ఉంటున్నట్టే లెక్క.

– ప్రతి మహిళ తన ఫోన్లో దిశయాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవడం లక్ష్యం కావాలి. దీన్ని సవాలుగా తీసుకోవాలి.

– ఇప్పటికి 70 లక్షల మంది డౌన్లోడ్‌ చేసుకోవడం... చాలా మంచి పరిణామం. 

– పోలీసు శాఖకు అభినందనలు అని సీఎం ప్రశంసించారు.

Comments