- జనార్ధనపురంలో త్రీ ఫేస్ విద్యుత్ లైన్ పనులకు శంఖుస్థాపన భూమిపూజ చేసిన వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి
గుడివాడ , సెప్టెంబర్ 2 (ప్రజా అమరావతి): గుడివాడ నియోజకవర్గం పరిధిలోని నందివాడ మండలం జనార్ధనపురం గ్రామంలో త్రీ ఫేస్ విద్యుత్ లైన్ ఏర్పాటు పనులకు వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ గురువారం భూమిపూజ , శంఖుస్థాపన కార్యక్రమాలను నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏడీఈ వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటికి పుష్పగుచ్ఛాన్ని అందజేసి సత్కరించారు . గ్రామ ప్రముఖుడు కొండపల్లి కుమార్ రెడ్డి పూలమాల వేసి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా జరిగిన సభలో దుక్కిపాటి మాట్లాడుతూ జనార్ధనపురం గ్రామంలో ఎప్పటి నుండో కలగా ఉన్న త్రీ ఫేస్ విద్యుత్ లైన్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు . దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు . ఇప్పటి వరకు ఉన్న పాత వైర్లను పూర్తిగా తొలగించడం జరుగుతుందన్నారు . 150 పెద్ద వీధి స్థంభాలను నెలకొల్పుతున్నామన్నారు . దాదాపు ఏడు కిలోమీటర్ల మేర విద్యుత్ వైర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు . రెండు 100 కేవీ ట్రాన్స్ ఫార్మర్లు , మూడు 25 కేవీ ట్రాన్స్ కొత్తగా 2/3 వస్తున్నాయన్నారు . నందివాడ మండలంలో ఎక్కువ నిధులను జనార్ధనప్పుడు నికే కేటాయిస్తున్నామన్నారు . వచ్చే ఎన్నికల నాటికి గ్రామంలోని అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామని హామీ ఇచ్చారు . ఎంతో చరిత్ర కల్గిన శివాలయం జీర్ణోద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని చెప్పారు . త్వరలో టెండర్లను పిలిచి ఆయా పనులను పూర్తిచేస్తామన్నారు . రూ . 40 లక్షల నాబార్డ్ నిధులతో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి నూతులపాడుకు వెళ్ళే రోడ్డుకు మరమ్మతులు చేపడతామన్నారు . జనార్ధనపురంలో ఏ సమస్య ఉన్నా మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) నాయకత్వంలో పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు . జనార్ధనపురం గ్రామంలో ప్రజలు కంపోస్ట్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని , దీనిపై తనకు అవగాహన ఉందన్నారు . కంపోస్ట్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాలని మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేసిందన్నారు . కంపోస్ట్ సమస్య ఇంకో ప్రాంతంలో ఉత్పన్నం కాకుండా రెవెన్యూ , మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు . భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తే కంపోస్టు తరలించడం జరుగుతుందని చెప్పారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దారా మరియమ్మ , ప్రముఖులు మలిరెడ్డి రామదాసురెడ్డి , కొండపల్లి కుమార్ రెడ్డి , కొప్పుల జోజి , జే ఏడుకొండలు , బోనం పద్మావతి , బత్తుల బెనర్జి , లింగాల ప్రెసిడెంట్ , కొల్లారెడ్డి నారపరెడ్డి , గాదిరెడ్డి బాలయ్య తదితరులు పాల్గొన్నారు .
addComments
Post a Comment