అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లించాలి* జిల్లా కలెక్టర్

 అక్రిడేటెడ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లించాలి* జిల్లా కలెక్టర్

  

అనంతపురం, సెప్టెంబర్ 13 (ప్రజా అమరావతి): రాష్ట్ర వ్యాప్తంగా క్రొత్తగా అక్రిడిటేషన్ కార్డులు పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ప్రీమియం రూ. 1250 cfms.ap వెబ్ సైట్ ద్వారా క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని   జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి  సోమవారం ప్రకటనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ను 2021-22 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, 31 మార్చి 2022 వరకు అమలులో ఉండే ఈ పధకానికి  జర్నలిస్టు వాటాగా రూ. 1250 చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ. 1250 లను చెల్లిస్తుందని   జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్రిడిటేషన్ల మంజూరుకు అడ్డంకులు తొలగిన నేపధ్యంలో జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  ఆమె కోరారు. 

జర్నలిస్టులు cfms.ap వెబ్ సైట్ నందు DDO Code : 8342 – 00 – 120 -01-03-001-001 VN, DDO Code : 2703 – 0802 – 003 నందు తమ వాటాను చెల్లించాలని  ఆమె సూచించారు. 

ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజనల్ చలానా, అక్రిడిటేషన్ కార్డు జిరాక్సు కాపీ, రెన్యువల్ జర్నలిస్టులయితే హెల్త్ కార్డు జిరాక్స్ కాపీలను రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు విజయవాడలోని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనరేట్ కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులైతే సంబంధిత జిల్లా కేంద్రంలో గల సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయవలసిందిగా  ప్రకటనలో  ఆమె తెలిపారు.


కొత్తగా అక్రిడిటేషన్ పొందినవారు  వారి కుటుంబంలో అర్హత కలిగిన వ్యక్తుల ఆధార్ కార్డు కాపీ, ఫొటోలు కూడా జతచేయాలి.