హైదరాబాద్ (ప్రజా అమరావతి);
_*హైదరాబాద్- విజయవాడ హైవేపై వరద.. స్తంభించిన ట్రాఫిక్*_
శనివారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని చింతలచెరువు నిండిపోయింది.
దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీగా వరదనీరు చేరడంతో ఈ ఉదయం హైవేపై ట్రాఫిక్ స్తంభించింది. స్థానిక పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
దీంతో ఆ ప్రాంతంలో నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి.
మరోవైపు బాటసింగారం నుంచి మజీద్‌పూర్ వెళ్లే దారిలో వాగులు పొంగిపొర్లుతున్నాయి.
వాగుల వద్ద పోలీసులు బారికేడ్లు పెట్టి వాహన రాకపోకలను నిలిపేశారు.
addComments
Post a Comment