ప్రవాసాంధ్రుల జనసేన టీం ఆధ్వర్యంలో లక్ష రూపాయల చెక్ అందజేత.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*ప్రవాసాంధ్రుల జనసేన టీం ఆధ్వర్యంలో లక్ష రూపాయల చెక్ అందజేత*



జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని అండర్ 18 వరల్డ్ క్లాస్ చెస్ ప్లేయర్ బొమ్మినేని మౌనిక అక్షయకు ప్రవాస జనసేన తరుపున లక్ష రూపాయల చెక్ అందజేశారు.


ఈ లక్ష రూపాయల చెక్ ను ప్రవాసాంధ్ర జనసేన టీం తరుపున ఉండవల్లిలో చవ్వాకుల కోటేష్ బాబు అందించారు.


హంగేరి లో జరుగుతున్న ప్రపంచ స్థాయి చెస్ పోటీలకు వెళ్తున్న సందర్భంగా ఆర్థిక సహాయం క్రింద ఈ లక్ష రూపాయల చెక్ అందించం అని ప్రవాస జనసేన నాయకులు చవ్వాకుల కోటేష్ బాబు తెలిపారు.


గతంలో కూడా మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందచేసాం అని భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం అందింస్తాం అని కొటేష్ అన్నారు.

Comments