*మల్టీ కలర్ తో ఆకర్షణీయంగా సప్తగిరి మాస పత్రిక
:*
తిరుమల (ప్రజా అమరావతి);
శ్రీవారి ఆశీస్సులతో టిటిడి ఆర్ష ధర్మ ప్రభోదం కోసం 1949వ సంవత్సరంలో సప్తగిరి పత్రికను బులెటిన్‌గా ప్రారంభించిందని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
★ 1970వ సంవత్సరం నుండి తెలుగు, తమిళం, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషల్లో,
★ 2014వ సంవత్సరం నుండి సంస్కృత భాషలో ముద్రణ ప్రారంభమైందన్నారు.
★ 2016వ సంవత్సరం నుంచి సప్తగిరిని పూర్తిగా రంగుల్లో పాఠకులకు అందిస్తున్నామన్నారు.
◆ ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆధ్యాత్మిక పత్రికల్లో అగ్రగామిగా ఉందన్నారు.
సప్తగిరి మాస పత్రిక ఆరు భాష్లల్లో పునఃప్రారంభమైందని, ఇందులో అనేక కొత్త శీర్షికలతో, ధారావాహికలతో పాఠకులకు నిరంతరాయంగా అందుతుందని చెప్పారు.
అంతకుముందు అగరబత్తుల తయారీ ప్లాంట్ వద్ద శ్రీవారి చిత్రపటానికి ఛైర్మన్, ఎమ్మెల్యే, ఈవో, అదనపు ఈవోలు పూజలు నిర్వహించి ప్లాంట్‌ను ప్రారంభించారు. తరువాత ప్లాంట్‌లో అగరబత్తులు తయారుచేసే యంత్రాల పనితీరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, సూళ్ళూరుపేట యం.ఎల్.ఏ శ్రీ సంజీవయ్య, పశు వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.పద్మనాభరెడ్డి, టీటీడీ సిఇ శ్రీ నాగేశ్వరరావు, గో సంరక్షణ శాల డైరెక్డర్ డా.హరనాథ రెడ్డి, దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు శ్రీ శ్రీనివాస్, శ్రీ ఆశోక్, శ్రీ హర్ష, సప్తగిరి మాస పత్రిక ముఖ్య సంపాదకులు శ్రీ రాధా రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
*తిరుమలలో నాలుగు కౌంటర్లలో అమ్మకాలు ప్రారంభం*
టీటీడీ తయారు చేయించిన అగరబత్తులు సోమవారం నుంచి తిరుమల లో భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచారు. తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద మూడు కౌంటర్లు, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పుస్తకాల విక్రయశాల వద్ద, ఒక కౌంటర్లో అగరబత్తుల విక్రయాలు ప్రారంభమయ్యాయి.
addComments
Post a Comment