కార్పొరేషన్ల డైరెక్టర్ల నియామకంలోనూ సామాజిక న్యాయం..

 

*- కార్పొరేషన్ల డైరెక్టర్ల నియామకంలోనూ సామాజిక న్యాయం..*


విజయవాడ (ప్రజా అమరావతి);

*- 47 కార్పొరేషన్లలో 481 డైరెక్టర్లను నియమిస్తూ ప్రకటన*


*- డైరెక్టర్లలో 52 శాతం మహిళలు.. 48 శాతం పురుషులు*


*- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సింహభాగం(58 శాతం)-ఓసీలకు 42 శాతం*


*- ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ,పేద వర్గాల్లో విశ్వాసం పాదు గొల్పేందుకు చిత్తశుద్ధి.*


*నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తుందిః శ్రీ సజ్జల*


*- సీఎం జగన్ గారు మహిళా పక్షపాతి, మహిళలకు అన్నింటా గౌరవం,గుర్తింపు: హోం మంత్రి శ్రీమతి సుచరిత*


*- సామాజిక న్యాయానికి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో మరెవరూ లేరుః మంత్రి శ్రీ వేణుగోపాల కృష్ణ.*


*ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే..:*


47 కార్పొరేషన్లు–481 డైరెక్టర్లు:


ఇవాళ 47 కార్పొరేషన్లకు సంబంధించి 481 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటిస్తున్నాం.              


481మంది డైరెక్టర్లలో 52 శాతం మహిళలు ఉండగా,48 శాతం పురుషులు ఉన్నారు.                


మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఒక ఉదాహరణ.               


ఇంకా డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు ఇవ్వగా,42 శాతం పదవులు ఓసీలకు ఇచ్చాం’


మాట నిలబెట్టుకున్నాం.


‘ప్రతి కార్పొరేషన్‌లో మహిళలకు సగానికి పైగా పదవులు ఇచ్చాం.            


ఆ పదవులన్నీ రాష్ట్రస్థాయిలోనే ఇవ్వడం జరిగింది.                


ఇంతగా ఎందుకు చెబుతున్నాం అంటే,కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు ఒక వర్గం మీడియా అనవసర రాద్దాంతం చేసే వీలుంది కాబట్టి,ముందే అన్నీ క్లియర్‌గా చెబుతున్నాం. 


పదవుల ఎంపిక చాలా క్లిష్టంగా కొనసాగింది. 


అయినా అన్ని విధాలుగా సమతుల్యం పాటించే విధంగా ఎంపిక జరిగింది’


‘సామాజికంగా, రాజకీయంగా వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ, వెతికి మరీ అభ్యర్థులను ఎంపిక చేశాం.             


కొన్ని కులాలలో అలా వెతకాల్సి వచ్చింది.           


ఇందుకోసం భారీ కసరత్తు చేశాం. 


చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఆయా వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది’.


‘సామాజికంగా,ఆర్థికంగా, రాజకీయంగా బీసీలకు మరింత ప్రాతినిథ్యం ఇస్తూ,క్యాబినెట్‌లో 60 శాతం బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. 


అసెంబ్లీ స్పీకర్‌ కూడా బీసీనే.రేపు రాబోయే మండలి అధ్యక్షుడు కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తి ఉండే వీలుంది’


నాడు అంతా భ్రమ:


‘2014–19 మధ్య టీడీపీ కేవలం మాటలు మాత్రమే చెప్పింది. కానీ ఏం చేయలేదు.           


బీసీలను,ఎస్సీలను అస్సలు పట్టించుకోలేదు.


కార్పొరేషన్ల ఛైర్మన్ల ఎంపిక ప్రస్తావన కూడా లేదు.     


ఒక నాయకుడికైతే పదవి ఇచ్చామని చెబితే, ఆయన కారులో బయలుదేరితే,మధ్యలోనే మొండిచేయి చూపారు.    


ఆ వర్గాల వారిని కేవలం భ్రమల్లో పెట్టి ఓట్లు వేయించుకోవాలని ఆ పార్టీ చూసింది’


వైయస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో..


‘2019లో అధికారంలోకి వచ్చాక..15 మందిని ఎమ్మెల్సీలను చేస్తే 11 మంది బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారున్నారు. 


నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే పనుల్లో 50 శాతం వారికే ఇచ్చే విధంగా చట్టం కూడా చేయడం జరిగింది. 


అయినా దాన్ని దాటి ఇస్తున్నాం’


‘సచివాలయాల ఉద్యోగుల్లో 83 శాతం ఆ వర్గాలకు చెందిన వారున్నారు.                     


ఆ వర్గాలలో ఒక విశ్వాసం పాదుకొల్పేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిబద్ధతతో కృషి చేస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ’


‘బీసీల కోసం ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.                        


ఇంకా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు,నగర పంచాయితీల ఛైర్మన్ల పదవుల్లో సగానికి పైగా పదవులు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వడం జరిగింది.                      


137 నామినేటెడ్ పోస్టులలో 79 పదవులు అంటే, 58 శాతం ఆ వర్గాల వారికి ఇచ్చామని గర్వంగా చెబుతున్నాం’


‘కార్పొరేషన్ ఛైర్మన్ల పోస్టులలో ఆ విధంగా వారికి ప్రాధాన్యం ఇచ్చాం. 


31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తే, వారిలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల వారున్నారు’


పూర్తి సామాజిక న్యాయం.


‘సామాజిక న్యాయం పూర్తిస్థాయిలో ఎక్కడా గతి తప్పకుండా (డీవియేషన్‌ లేకుండా), ఎవరినీ భ్రమలో పెట్టే ప్రయత్నం చేయకుండా, నిజాయితీ,నిబద్ధతతో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు పని చేస్తున్నారు. 


అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారో, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అవి ప్రతి ఒక్కటి అమలు చేసి చూపుతున్నారు. 


అట్టడుగు వర్గాల వారు రాజ్యాధికారంలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం వహించేలా సీఎం గారు కృషి చేస్తున్నారు.                     


ఆ వర్గాల వారు వైయస్సార్‌సీపీ పక్షాన నిర్ణయాధికారంలో ఉండే విధంగా సీఎం గారు పని చేస్తున్నారు’.


*హోం మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత మాట్లాడుతూ..ఏమన్నారంటే..:*


సీఎంగారు మహిళా పక్షపాతి.


‘47 కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్లను ఇవాళ ప్రకటిస్తున్నాం. సీఎం గారు మహిళా పక్షపాతి. 


అందుకే వారికి 52 శాతం పదవులు ఇచ్చారు. 


సమాజంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీలు గతంలో ఎప్పుడూ అణగదొక్కబడ్డారు.       


కానీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ మాత్రం ఆ వర్గాలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. 


మంత్రివర్గం కూర్పు నుంచే అది కనిపించింది.     


ఆయన పురుషుల కంటే మహిళలకు అన్ని పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు’.


‘మహిళలు సామాజికంగా, రాజకీయంగా,ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన చేతల్లో చేసి చూపుతున్నారు.        


వారిని రాజకీయంగా అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా,వారు ఎదిగేలా ప్రోత్సాహం కూడా ఇస్తున్నారు.            


గతంలో మహిళలకు ఎవరూ మేలు చేయలేదు.          


మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే సామాజిక, రాజకీయ చైతన్యం వస్తుందని ఆయన నమ్మారు’.


అది ఆయన గొప్పతనం.


‘మహిళలకు గౌరవం, గుర్తింపు ఇవ్వడం సీఎం గొప్పతనం.             


దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు మహిళల పేరుమీదే ఇస్తూ, వారికి అండగా,తోడుగా నిల్చారు. ఇది మహిళా లోకం చేసుకున్న అదృష్టం. 


ఆయన మహిళల పేరుమీద ఒక తోబుట్టువులా స్థిరాస్తి కల్పిస్తున్నారు’.


తోబుట్టువులా నిలుస్తున్నారు.

‘అన్ని పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.                


అమ్మ ఒడి వంటి పథకంలో తల్లుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు.         


చేయూత,ఆసరా పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారు. 


మాకు ఆయన ఒక తోబుట్టువులా అన్నీ చేస్తున్నారు.            


అందుకే మహిళలంతా ఆయనను ఒక అన్నలా భావిస్తున్నారు.          


డైరెక్టర్‌ పదవుల్లో 58 శాతం ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనారిటీలకు ఇచ్చారు.                  


అలాగే మహిళలకు 52 శాతం పదవులు ఇచ్చారు’.


*అంబేడ్కర్‌ కల–నేడు సాకారం.*


‘56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా ఇన్నాళ్లూ గుర్తింపు లేని కులాలకు కూడా తగిన గుర్తింపు, ప్రాధాన్యం వచ్చింది.         


ఆ విధంగా ఆనాడు అంబేడ్కర్‌ కోరుకున్న సమసమాజ స్థాపన. 


అట్టడుగు వర్గాల వారికి గుర్తింపు ఇప్పుడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ హయాంలోనే జరుగుతోంది.          


అందుకే బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలంతా సీఎంగారికి రుణపడి ఉంటారు.                  


మాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు మహిళలందరి తరపున సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’.


*ఇది బీసీల ప్రభుత్వంః మంత్రి వేణుగోపాలకృష్ణ*


*- బీసీలను బాబు ఎప్పుడూ చులకనగానే చూశారు*


*- సీఎంకు.. సామాన్యుడికి మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు.*


*- బాబు హయాంలో మాటలకే పరిమితమైన సామాజిక న్యాయం..*


*- చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపిస్తున్న సీఎం శ్రీ జగన్.*


*బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఏమన్నారంటే.*


బాబు హయాంలో మాటల్లోనే..


సామాజిక న్యాయం అంటే అందరికి సమానంగా అందించడం. 


ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏర్పర్చుకున్న వ్యవస్థలే ప్రభుత్వాలు.                    


ఆ ప్రభుత్వంలో ఉన్న పాలకులు...నిండు మనసుతో అందర్నీ సమదృష్టితో చూడగలగాలనే ఆకాంక్షను గత పాలకులు ఎవరూ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు.            


గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలన తీరు చూస్తే.. సామాజిక న్యాయం అన్నది కేవలం మాటల్లోనే కానీ.. చేతల్లో కనిపించ లేదు.       


రాజకీయ వ్యవస్థపై నమ్మకాలు సడలిపోయే పాలకుల్ని మనం చూశాం.


దేశానికే మార్గదర్శిగా సీఎం శ్రీ జగన్..


రాజకీయాల్లో సత్యమే వచించాలని,ప్రజలను ఎప్పుడూ మోసగించ కూడదని ఈ దేశానికి ఒక మార్గదర్శిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు తీసుకున్న నిర్ణయాలు, 26 మాసాల పాలన కాలంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే నిదర్శనం.          


ఈ రాష్ట్రంలో ఇంతకాలం రాజకీయ ప్రాతినిధ్యం లభించని బడుగు, బలహీన వర్గాలు అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు..ఈరోజు ఒక భరోసా లభించింది. దానితో పాటు ఆ వర్గాల ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది.              


కారణం,ముఖ్యమంత్రి జగన్ గారు మంత్రివర్గ కూర్పు నుంచి  డైరెక్టర్ల నియామకాలు వరకూ చెప్పిన మాటను చెప్పినట్టు అమలు చేయడమే.          


సామాజిక న్యాయానికి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలో మరెవరూ లేరు. 


ముఖ్యమంత్రిగారి ప్రతి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం అవసరం ఎవరికి ఉంది,వారిని ఎలా ప్రభుత్వంలో భాగస్వామ్యులు చేయాలనే తపనే ఇందుకు ప్రధాన కారణం.


బీసీలు,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలు ప్రభుత్వ పథకాలను అందుకుని ఉన్నతంగా ఎదగాలి, ఇదే ప్రభుత్వాల లక్ష్యం అవ్వాలి.                         


ఈ విషయంలో గత ప్రభుత్వాలు ప‍్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యాయి. 


అదే మనసున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఈ వర్గాల ప్రజల కష్టాలను స్వయంగా చూసి.. ఆ సమస్యల పరిష్కార మార్గాలు వెతికి నిజమైన లబ్ది వారికి చేరేలా చేసిన నాయకుడు వైఎస్‌ జగన్‌గారు. 


ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, పేద వర్గాలకు డీబీటీ ద్వారా రూ. 1.04 లక్షల కోట్లు జమ..


ఈ 26 మాసాల కాలంలో డీబీటీ ద్వారా బీసీ,ఎస్సీ ఎస్టీ, మైనార్టీ వర్గాల ఖాతాల్లోకి నేరుగా ఒక లక్షా 4వేల,200 కోట్ల రూపాయలను జమ చేసిన ఘటన ఇది.    


నేరుగా వారి ఖాతాలకు డబ్బును జమచేసిన గొప్ప మనసు ఉన్న ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలుస్తారు.

 

-డీబీటీ ద్వారా బీసీలకు రూ. 50,495 కోట్లు, ఎస్సీలకు రూ. 17వేల 12కోట్లు,ఎస్టీలకు రూ. 5,383 కోట్లు, మైనార్టీలకు రూ. 4,383 కోట్లు నేరుగా అందింది. 


ఇక నాన్‌ డీబీటీ కూడా కలుపుకుంటే..మొత్తం రూ. లక్షా 40వేల 438 కోట్లు పథకాల ద్వారా ఆ వర్గాల ఖాతాల్లో జమ చేశాం.                    


బీసీలకు రూ. 63 వేల 426 కోట్లు, ఎస్సీలకు రూ. 24వేల 167కోట్లు, ఎస్టీలకు రూ. 7వేల 114కోట్లు, మైనార్టీలకు రూ. 7వేల 81కోట్లు నేరుగా అందింది.


నాటి పాలకులకు బీసీలు అంటే చులకన భావన..

"అందుకే తోకలు కత్తిరిస్తాం,తోలు తీస్తామంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకోవాలి.           


బీసీలు అంటే వినిపోతారు.. నోరులేదు అడగలేరనే భావన. కేవలం అయిదేళ్ల పాలనా కాలంలో పెద్దల సభకు ఒకరిని కూడా పంపలేని నాటి పాలకుడి పాలన... పెద్దల సభకు 15మందిని ఎంపిక చేస్తే వారిలో 11మందిని ఈ వర్గాల నుంచి ఎంపిక చేయడం,పార్లమెంట్‌లో రాజ్యసభకు ఇద్దర్ని బీసీలను ఎంపిక చేసిన విధానం చూస్తే నేటి పాలకుడి గొప్ప మనసుకు ఇది తార్కాణం అని చెప్పవచ్చు."


"దేశంలో బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రులు అయివారు ఉన్నారు.    


కానీ బీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనార్టీ వర్గాల గురించి ఇంతగా ఆలోచించిన దాఖలాలు లేవు.                            


ఇది బీసీల ప్రభుత్వం.                      


ఈ ప్రభుత్వంలో చేసే ప్రతిపని వారి కోసమే.             


వారిని రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించేవారిగా తీర్చిదిద్దాలనేదే జగన్ గారి లక్ష్యం.                      


అలాగే మహిళలకు 52శాతం ప్రాతినిధ్యం కల్పించడం. 


ఏ వర్గాలకు అయితే రాజకీయాలు అందని ద్రాక్ష అనుకున్నారో వారికి ప్రాతినిధ్యం కల్పిస్తూ 47 కార్పొరేషన్ల ద్వారా 481మంది డైరెక్టర్లను నియామం చేయడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యొక్క ఆత్మగౌరవ రక్షకుడిగా జగన్ గారిని అభివర్ణించాలి." 


గత పాలకుడు చంద్రబాబు హయాంలో బీసీ వర్గాల్లో ఆత్మ న్యూనత భావం ఉంటే... ఇవాళ బడుగు,బలహీన వర్గాల వారి ఆత్మగౌరవాన్ని రక్షించి,వెలికితీసి వారిని సమాజ సేవలో భాగస్వాములు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. 


ఇది నిజంగా ఇది బీసీల ప్రభుత్వం.              


బీసీలకు సువర్ణ అధ్యాయాన్ని రాజకీయ చరిత్రలో లిఖించిన నాయకుడు వైఎస్‌ జగన్‌ గారు.


*ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ఏమన్నారంటేః*


స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంబేద్కర్‌ గారు రాజ్యాంగాన్ని రచించి అనేక సంస్కరణలు తీసుకువస్తే.. 


భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిది.        


47 కార్పొరేషన్లకు డైరెక్టర్ల ఎంపిక విషయంలో సామాజిక కోణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. 


రాష్ట్రంలో ప్రతిపక్షం తీరు దున్నపోతు ఈనిందంటే.. దూడ ఎక్కడుందని తిరుగుతున్నట్లుగా ఉంది. 


సామాజికంగా,ఆర్థికంగా పేద కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారు పనిచేస్తుంటే... ప్రతిపక్ష నాయకుడు మాత్రం ప్రభుత్వంపై గుడ్డ కాల్చి నెత్తిన వేయాలని చూస్తున్నారు.


ఒక్క పదవులే కాకుండా ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు డీబీటీల ద్వారా నగదు జమ చేసిన ఘనత ముఖ్యమంత్రిగారిదే. 


ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా అర్హులైన ప్రతి కుటుంబం ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కావడం ఎక్కడా చూసి ఉండం.                  


ఇలాంటి విధానం భారతదేశ చరిత్రలోనే ముందెన్నడూ లేదు. 


సామాజిక కోణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల అభివృద్ధి అనేది ఒక్క జగన్‌ మోహన్‌ రెడ్డిగారికే సాధ్యం.                  


ఇలాంటి అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రిగారికి ధన్యవాదాలు చెబుతున్నాం.        


రాబోయే రోజుల్లో అందరికి అవకాశం లభిస్తుంది. 481మంది డైరెక్టర్లకు శుభాభినందలు.


*ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ.. ఏమన్నారంటేః*     


గతంలో చైర్మన్లను ప్రకటించినప్పుడు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కానీ, మాకు పదవులు రాలేదని అసంతృప్తి లేకుండా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు నిర్ణయాలు తీసుకున్నారు. 


కింద స్థాయి నుంచి పైస్థాయి వరకూ ప్రతి ఒక్కరినీ పరిశీలించి అవకాశం ఇచ్చారు. 


ఒకవేళ అవకాశం రానివాళ్లు ఎక్కడన్నా ఉన్నా..వారికి కూడా రాబోయే రోజుల్లో అవకాశం లభిస్తుందనే నమ్మకంతో అందరూ ముందడుగు వేస్తున్నారు.


పదవి కాదు.. బాధ్యత..

మన జగనన్న మన కోసం పని చేస్తున్నారు. 


మనందర్ని సొంతం చేసుకుని పని చేస్తున్నారు.                


గొప్ప మనసు ఉన్న జగనన్నకు ఎల్లప్పుడూ అందరూ అండగా ఉండాలి.    

₹రానున్న రోజుల్లో అందరికీ అవకాశాలు వస్తాయి. 


పదవులు దక్కినవారు పదవి అని అనుకోకుండా.. బాధ్యత అనుకుని పని చేయాలి.  


కులాలు,మతాలు మధ్య చిచ్చుపెట్టాలని కొంతమంది దుర్మార్గులు చూస్తున్నారు.         


అయినా ముఖ్యమంత్రిగారు తొణకకుండా తమ పని తాను చేసుకుంటూ మనందరికీ న్యాయం చేస్తున్నారు.        


దుర్మార్గపు ఆలోచనలు చేసేవారికి రానున్న రోజుల్లో అందరూ బుద్ధి చెప్పేలా పనిచేయాలి.               


వచ్చే 15 ఏళ్ల వరకూ జగన్‌ మోహన్‌ రెడ్డిగారే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.


*పవర్ ఆఫ్ ఆర్టీఐ*