*"అర్హులైన వారందరికీ పెన్షన్లు" - కాకాణి*
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
.*
*సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.*
*వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పెన్షన్లు అందిస్తాం.*
రమ్య దుర్ఘటనను తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతానికి పాల్పడుతుంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టి, సామాజిక న్యాయానికి కట్టుబడి పని చేస్తున్నారు.
47 కార్పొరేషన్లకు 481 మంది డైరెక్టర్లను నిర్మిస్తే, మహిళలకు సగానికిపైగా కేటాయించడంతో పాటు, 60 శాతం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను నియమించారు.
తెలుగుదేశం పార్టీ బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని వదిలి వేయడం తప్ప, దళితులను, వెనుకబడిన వర్గాలను ఏనాడూ ప్రోత్సహించలేదు.
ఎన్నికలకు ముందు హడావుడిగా చంద్రబాబు పదవుల పందేరం పేరుతో నియామకాలు చేపడితే, ఉత్తర్వులు వచ్చే లోపు ఎన్నికలు వచ్చాయి.
తెలుగుదేశం ప్రభుత్వంలాగా పక్షపాత వైఖరితో అర్హులైన వారికి పెన్షన్ తీసివేసే ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదని గుర్తుంచుకోండి.
విచారణ పూర్తయిన తర్వాత
అనర్హులుగా భావించి నిలుపుదల చేసిన పెన్షన్లను అర్హులు అని తేలినవారికి వెంటనే పునరుద్ధరిస్తాం.
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటాం.
తెలుగుదేశం పార్టీ నాయకులు గాడిదలకు వినతి పత్రాలు ఇవ్వడం చూస్తుంటే, గాడిద పాలన రావాలని కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది.
చంద్రబాబు హైదరాబాదులో జూమ్ మీటింగ్ లో ఇచ్చిన ఆదేశాలను తెలుగుదేశం నాయకులు వెనక ముందు ఆలోచన చేయకుండా, పాటించడం వల్ల ప్రజలలో తెలుగుదేశం పార్టీ పట్ల ఏహ్యభావం కలుగుతుంది.
రాష్ట్రంలో దురదృష్టమైన సంఘటన జరిగి, రమ్య హత్యకు గురైతే ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై చర్యలకు ఉపక్రమించింది.
రమ్య దుర్ఘటనను తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలకు వాడుకుంటుంది.
నెల్లూరులో ఉద్యోగం రాలేదని కమల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ, లోకేష్ పరామర్శించడానికి నెల్లూరు వస్తే, కమల్ కుటుంబ సభ్యులు లోకేష్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు.
10 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసుకున్న కమల్ ఆత్మహత్యకు పాల్పడితే, ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఇవ్వలేక పోయినందుకు కమల్ లాంటి ఎన్నో కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి.
గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు స్మశానాలను ఆక్రమించుకుంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు వాటికి పట్టాలు మంజూరు చేశారు.
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న, గ్రామాలలో స్మశాన వాటికలు లేక, ఆక్రమణలకు గురై, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామస్తులకు అవసరమైన స్మశాన స్థలాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే, దాని పై సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు.
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, అభివృద్ధిలో రాజీపడకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, పని చేస్తాం.
addComments
Post a Comment