అమరావతి (ప్రజా అమరావతి):
రాష్ట్రంలోని యువత, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) చేస్తున్న కృషిని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అభినందించారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం ఎపిఎస్‌ఎస్‌డిసి సిబ్బందితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎపిఎస్‌ఎస్‌డిసి అమలు చేస్తున్న వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, లక్ష్యాలను సంస్థ ఎండి ఎన్ బంగారరాజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లోనూ మార్పులు తీసుకురావాలని ఆయన సూచించారు. నిర్మాణ రంగం, మౌళిక సదుపాయాలు, సర్వీసెస్, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ఈ రంగాల్లో ఎక్కువ మందికి మార్కెట్ లో వస్తున్న ట్రెండ్స్ కు అనుగుణంగా శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. మిషనరీ, మ్యాన్ పవర్, మెటీరియల్, మనీ అండ్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఆటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ పెంచేలా ఎపిఎస్‌ఎస్‌డిసి శిక్షణా కార్యక్రమాలు ఉండాలని ఆయన సూచించారు. ఎపిఎస్‌ఎస్‌డిసికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితోపాటు ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి ఎన్. బంగారరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ డి.వి రామకోటిరెడ్డి, కె. విజయ్ మోహన్ కుమార్, సీజీఎంలు, జీఎంలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment