అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి వైస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలం పట్టా ఇచ్చి

 పశ్చిమగోదావరి జిల్లా... ఏలూరు..(ప్రజా అమరావతి);.


అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి వైస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలం పట్టా ఇచ్చి


ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ద్యేయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు... ఏలూరు నియోజకవర్గంలో ఇప్పటికే 31వేలకు పైబడి అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలం పట్టాలు ఇచ్చామని, అర్హత ఉండి ఇళ్ల పట్టా తీసుకొని వారికి కూడ ఇళ్ల పట్టా అందిస్తామని మంత్రి ఆళ్ల నాని చేప్పారు...ఏలూరు నియోజకవర్గం పరిధిలోని సత్రంపాడులో నివాసం ఉంటున్న దుర్గమ్మతో పాటు పలువురు మహిళలు ఆదివారం ఏలూరులోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆళ్ల నానిని కలిచి ఇళ్ల స్థలం పట్టా ఇప్పించాలని విన్నవించారు...

వెంటనే ఏలూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్ బాబుని పిలిచి దుర్గమ్మతో ఇల్లు లేని నిరు పేద మహిళలకు ఇళ్ల స్థలం పట్టాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు... తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆళ్ల నాని వివిధ ప్రాంతాలు నుండి వచ్చిన ప్రజలు నుండి వినతులు స్వీకరించారు...


ప్రతి ఒక్కరూ సమస్య ను స్వయంగా అడిగి తెలుసుకొని సత్వరమే వారి సమస్యలు పరిష్కారం చేయాలని మంత్రి ఆళ్ల నాని సంబందించిన అధికారులకు ఫోన్ లో విజ్ఞప్తి చేశారు...


ఉద్యోగాలు కోసం వచ్చిన వారికి మంత్రి ఆళ్ల నాని భరోసా ఇస్తూ విద్యార్హతలు కలిగిన వారికి మెరిట్ ఆధారంగా ప్రభుత్వం విధించిన నిబంధనలు ప్రకారం పారదర్శికంగా బ్యాక్ లాక్ ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేస్తుందని మంత్రి ఆళ్ల నాని చేప్పారు...


Comments